హైవే గ్రామాల్లో సోలార్ వెలుగులు
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:23 PM
జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంలో భాగంగా ఏజెన్సీలో పాడేరు నుంచి అరకులోయ మార్గంలోని గ్రామాల్లో సోలార్ వెలుగులు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి.

లైట్ల వెలుగుల్లో ఆక ర్షణీయంగా గిరి గ్రామాలు
పాడేరు, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంలో భాగంగా ఏజెన్సీలో పాడేరు నుంచి అరకులోయ మార్గంలోని గ్రామాల్లో సోలార్ వెలుగులు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. హైవేను ఆనుకుని ఉన్న గ్రామాలకు హైవే అథారిటి సోలార్ వీధి దీపాలతో పాటు ఫుట్‌పాత్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా పాడేరు మండలం చింతలవీధిలో, హుకుంపేట మండలం కొట్నాపల్లి, పెదగరువు గ్రామాల్లో ఇప్పటికే సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రులు ఆయా గ్రామాలు వీధిలైట్ల వెలుగులో ఎంతో ఆకర్షణీయంగా, నగరాలను తలపించేలా కనిపిస్తున్నాయి.