Share News

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చిన్నంశెట్టి రాజు

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:28 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చిన్నంశెట్టి రాజు నియమితులయ్యారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చిన్నంశెట్టి రాజు

పలువురు జడ్జిలకు స్థాన చలనం

విశాఖ లీగల్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చిన్నంశెట్టి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రస్తుతం జిల్లా జడ్జిగా పనిచేస్తున్న ఆలపాటి గిరిధర్‌ను వ్యాట్‌ ట్రైబ్యునల్‌ అధ్యక్షునిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో రాజును నియమించారు. అదేవిధంగా విశాఖ పదో అదనపు జిల్లా జడ్జి ఎన్‌.శ్రీవిద్యను కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేశారు. అమలాపురం-2 జిల్లా జడ్జి వి.నరేశ్‌ విశాఖ అదనపు జిల్లా జడ్జిగా వస్తున్నారు. విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టు జడ్జి పి.గోవర్దన్‌ను కాకినాడ ఆరో అదనపు న్యాయమూర్తిగా, నగరంలో పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనందిని కాకినాడ రెండో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు.

Updated Date - Apr 08 , 2025 | 01:28 AM