Share News

Confusion among the Secretariat staff సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:01 AM

Confusion among the Secretariat staff గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు గురువారం విడుదల చేసిన ఉత్తర్వులతో ఉద్యోగులు కలవరపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. జీవోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన జాబితాలో సచివాలయం నుంచి తప్పించినట్లు పేర్కొన్న సాధారణ ప్రయోజన ఉద్యోగులంతా ‘మన పరిస్థితింటే అంటూ’ ఒకరికొకరు వాకబు చేసుకుంటున్నారు.

Confusion among the Secretariat staff సచివాలయ ఉద్యోగుల్లో   గందరగోళం
ఫొటో రైటఫ్‌ః- 12కోట1: శృంగవరపుకోట గ్రామ సచివాలయం- 2

సచివాలయ ఉద్యోగుల్లో

గందరగోళం

హేతుబద్ధీకరణలో నిర్దిష్ట ప్రయోజన ఉద్యోగుల కేటాయింపులో స్పష్టత కరువు

ఏడుగురు గ్రామ, ఆరుగురు వార్డు సచివాలయాల్లో విధులు

వీరిలో నలుగురికే బాధ్యతలట

ఇప్పటికే సాధారణ ప్రయోజన ఉద్యోగులను తగ్గించిన ప్రభుత్వం

- వేపాడ మండలం సోంపురం గ్రామ సచివాలయంలో ప్రస్తుతం 11 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో సాధారణ ప్రయోజన (మల్టీపర్పస్‌) ఉద్యోగులుగా గుర్తించిన నలుగురిలో డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌, ఎడ్యూకేషన్‌ అసిస్టెంట్‌లను ఉంచి పంచాయతీ సెక్రటరీ, మహిళ పోలీస్‌లను బాధ్యతల నుంచి తప్పించారు. వీరికి ఎక్కడ ఉద్యోగ బాధ్యతలు అప్పగించనున్నారో తెలియదు. ఇక నిర్దిష్ట ప్రయోజన ఉద్యోగులు (టెక్నికల్‌)గా గుర్తించిన మిగిలిన ఏడు శాఖలకు చెందిన గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ, ఎనర్జీ అసిస్టెంట్‌లలో నలుగురే సచివాలయంలో ఉండాలి. మిగతా వారి పరిస్థితి ఏంటో తెలియడం లేదు.

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి):

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు గురువారం విడుదల చేసిన ఉత్తర్వులతో ఉద్యోగులు కలవరపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. జీవోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన జాబితాలో సచివాలయం నుంచి తప్పించినట్లు పేర్కొన్న సాధారణ ప్రయోజన ఉద్యోగులంతా ‘మన పరిస్థితింటే అంటూ’ ఒకరికొకరు వాకబు చేసుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఉంచుతారా? మరేదైనా శాఖలో వీలినం చేస్తారా? అంటూ తమకు పరిచయం ఉన్న ఉన్నతాధికారులతోనూ మాట్లాడుతున్నారు. ఇక నిర్దిష్ట ప్రయోజన ఉద్యోగుల్లో ఏ శాఖకు చెందిన ఉద్యోగులు సచివాలయాల్లో పని చేయాల్లో స్పష్టంగా చెప్పకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఏఎన్‌ఎంలు తప్ప మిగిలిన శాఖలకు చెందిన ఉద్యోగులంతా టెన్షన్‌ పడుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ‘మీ శాఖ ఉద్యోగులు ఉంటారని ఒకరంటే మీ శాఖకు చెందిన ఉద్యోగులను ఉంచే అవకాశం ఉందని’ మరో శాఖకు చెంది ఉద్యోగులు బదులిస్తున్నారు. రెండు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తున్నందున అన్నిశాఖల ఉద్యోగులకు ఏదో ఒక సచివాలయంలో బాధ్యతలు అప్పగిస్తారని అధికార యంత్రంగం చెబుతోంది. ఎవరూ భయపడాల్సిన పని లేదని ఇందుకు సబంధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందంటున్నారు.

జీవోతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేయాల్సిన సాధారణ ప్రయోజన ఉద్యోగుల వివరాలతో జాబితాను తయారు చేశారు. ఏ కేటగిరికి చెందిన ఒక సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌, ఎడ్యూకేషన్‌ అసిస్టెంట్‌లను ఉంచితే, మరో సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ, మహిళ పోలీస్‌లను ఉంచారు. ఇలా ఇద్దరినీ ఒక చోట తప్పిస్తే, మరో చోట మరో ఇద్దరిని తప్పించారు. బి కేటగిరికు చెందిన సచివాయాల్లో ఒక చోట మహిళ పోలీస్‌ను, మరో చోట వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యూకేషనల్‌ అసిస్టెంట్‌ను తగ్గించారు. ఇలా తప్పించిన ఉద్యోగులకు ఎటువంటి బాద్యతలను అప్పగించనున్నారో స్పష్టత లేకపోవడంతో పాటు సచివాలయానికి నలుగురు నిర్దిష్ట ప్రయోజన ఉద్యోగులు ఉండాలని సూచించిన ప్రభుత్వం ఏడు శాఖల్లో ఏ శాఖకు చెందిన ఉద్యోగుల విధులు నిర్వర్తించాలో చెప్పకపోవడంతో గందరగోళంగా మారింది.

హేతుబద్ధీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేయాల్సిన ఉద్యోగులు

------------------------------------------------------------------------------------

కేటగిరి సాధారణ ప్రయోజన నిర్దిష్టప్రయోజన

జనభా ఉద్యోగుల సంఖ్య ఉద్యోగుల సంఖ్య మొత్తం ఉద్యోగులు

(మల్టీపర్పస్‌) (టెక్నికల్‌)

--------------------------------------------------------------------------------------------------------

ఏ 2,500లోపు 2 4 6

బి 2,501-3500 3 4 7

సీ 3,500 పైన 4 4 8

విజయనగరం జిల్లా

----------------------------------------------------------------------

కేటగిరి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు

---------------------------------------------------------------------

ఏ 138 4

బీ 186 28

సీ 120 53

------------------------------------------------------------------

మెత్తం 444 85

-------------------------------------------------------------------

పార్వతీపురం మన్యం జిల్లా

-------------------------------------------------------------------

కేటగిరి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు

--------------------------------------------------------------------

ఏ 89 2

బీ 86 14

సీ 45 13

---------------------------------------------------------------------

మెత్తం 220 29

------------------------------------------------------------------

Updated Date - Apr 13 , 2025 | 01:01 AM