రైలు నుంచి జారిపడి కానిస్టేబుల్ మృతి
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:15 AM
కొత్తవలస పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బొబ్బిలి రామకోటి (37) రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.

విజయనగరం క్రైం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బొబ్బిలి రామకోటి (37) రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. రామకోటి ఈనెల 1న విశాఖ నుంచి విజయనగరం వస్తున్న సమయంలో కోరుకొండ విజయ నగరం రైల్వేస్టేషన్ మధ్య జొన్నవలస సమీపంలో ప్రమాదవశాత్తు జారిపడి పడి తీవ్రగాయాల పాలయ్యారన్నారు. రామకోటి కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నార న్నారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.