Share News

మౌలిక సదుపాయల కల్పనకు కృషి

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:55 PM

నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్లు, కాలువలు, మంచినీరుతదితర మౌలిక సదు పాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్‌ తెలిపారు. ఆదివారం మండలంలోని ఇజ్జిపే ట వద్ద మొగలివలస సెంటర్‌ నుంచి ఇజ్జి పేట వరకు తారు రోడ్డు పనులకు శంకు స్థాపన చేశారు.

మౌలిక సదుపాయల కల్పనకు కృషి
రాజాం: మాట్లాడుతున్న కోండ్రు మురళీమోహన్‌

సంతకవిటి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్లు, కాలువలు, మంచినీరుతదితర మౌలిక సదు పాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్‌ తెలిపారు. ఆదివారం మండలంలోని ఇజ్జిపే ట వద్ద మొగలివలస సెంటర్‌ నుంచి ఇజ్జి పేట వరకు తారు రోడ్డు పనులకు శంకు స్థాపన చేశారు.ఈ సందర్భంగా విలేకరుల తో మాట్లాడుతూ టీటీడీలో గోమరణాలపై భూమణ కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం చేసి, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు మానుకోవాలని కోరారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులుకొల్ల అప్పలనాయుడు, వల్లూరు గణేష్‌, గట్టి భాను, సమతం శ్రీను, మహేష్‌బాబు, సలాది రమా, శంకర రావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.

ఫరాజాం,ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి):వైసీపీ పాలనలో పంచాయతీలు నిధులు లేమితో అభివృద్ధికి నోచుకోలేదని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేపడుతోందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. రాజాం నుంచి బిళ్లాని పంచాయతీ పరిధిలోగల తారు రోడ్డు నిర్మాణానికి మెగిలివలస వద్ద శంకు స్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ టీటీడీ గోమరణాలపై భూమన కరు ణాకరరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాదిమంది ప్రజల మనోభా వాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కొళ్ల అప్పలనాయుడు, బొత్స వాసుదేవరావునాయుడు, కోండ్రు జగదీష్‌, గురవాన నారాయణరావు, నంది సూర్యప్రకాష్‌రావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, దూబ ధర్మారావు, పొట్నూరు లక్ష్మణరావు, మాడుగుల జయరాం, వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 11:55 PM