Share News

పిండమార్పిడితో మంచి ఫలితాలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:19 AM

పశువుల్లో పిండమార్పిడి విధానం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ పశుగణా భివృద్ధి సంస్థ రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

పిండమార్పిడితో మంచి ఫలితాలు
దూడను పరిశీలిస్తున్న శ్రీనివాసరావు

  • పశు సంపద అభివృద్ధికి చర్యలు

  • పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు

రామభద్రపురం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): పశువుల్లో పిండమార్పిడి విధానం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ పశుగణా భివృద్ధి సంస్థ రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. జగన్నాథపురం గ్రామంలో మంగళవారం పిండ బదిలీ పద్ధతి ద్వారా ఉత్తరాంధ్రలో మొదటిసారిగా జన్మించిన గిరి జాతి ఆవు దూడను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత సంవత్సరంలో పిండ బదిలీ ప్రక్రియ కు సంబంధించి 40 మందికి శిక్షణ ఇప్పించామని తెలి పారు. మేలుజాతి ఆడదూడలను ఈ పద్ధతి ద్వారా పొందవచ్చు నన్నారు. ఈ ఏడాది 1500 పశువులకు పిండమార్పిడి విధానం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ ప్రక్రియను చేపడతామని తెలిపారు. దీని కోసం పశువైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని ఆయన వివరించారు. అనంతరం పాడి రైతులతో మాట్లాడి.. సమస్యలను తెలుసుకున్నారు. పాడి రైతులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వై.వి.రమణ, డీఎల్‌డీఏ కార్యనిర్వహ ణాధికారి రాధాకృష్ణ, ఉప సంచాలకులు డాక్టర్‌ దామోదరరావు, సహాయ సంచాలకులు విష్ణు, పశువైద్యాధికారు డాక్టర్‌ సురేష్‌, శ్రీనివాస్‌, జగదీష్‌లు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:19 AM