సమస్యలు పరిష్కారానికి చొరవ
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:02 AM
గ్రామాల్లోని ప్రధాన సమస్యల పరి ష్కారానికి ప్రత్యేక చొరవ చూపనున్నట్లు కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ తోయక జగదీశ్వరి తెలిపారు.

గరుగుబిల్లి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని ప్రధాన సమస్యల పరి ష్కారానికి ప్రత్యేక చొరవ చూపనున్నట్లు కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ తోయక జగదీశ్వరి తెలిపారు. బుధ వారం గరుగుబిల్లిలో పార్టీ మండలాఽ ధ్యక్షుడు అక్కేన మధుసూదనరావు అధ్యక్షతన మండల స్థాయి టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమా వేశం నిర్వహించారు.ఈసందర్భంగా మాట్లాడు తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెర వేర్చేందుకుచర్యలు చేపడుతున్నామన్నారు. కార్య కర్తల సమస్యలను తెలుసుకుని తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు.జంఝావతి ప్రాజెక్టు పరిధిలో పూర్తిస్థాయిలో సాగునీటితో అందజేయడంతోపాటు తోటపల్లిలో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుకు చొరవ చూపిస్తామని తెలిపారు.సమావేశంలో పార్టీ ప్రతినిధులు ఎం.పురుషోత్తంనాయు డు, ఎం.తవిటినాయుడు, డి.సత్యనారాయణ, ఎంబీ విజయవాంకుశం, కె.భరత్‌కుమార్, డి.ధనుంజ యరావు, కురుపాం ఏఎంసీ చైర్మన్ కె.కళావతి, అంబటి రాంబాబు పాల్గొన్నారు. కాగా గరుగుబిల్లిలో నిర్వహించిన ఓ కార్య క్రమంలో లఖనాపురం గ్రామానికి చెందిన పాలవలస శ్రావణ్‌కుమార్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన రూ.80 వేలు చెక్కును ఎమ్మెల్యే అందించారు.
ప్రాధాన్యత పనులకు ప్రత్యేక చర్యలు
గ్రామాల్లో ప్రాధాన్యత పనులకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు. గరుగుబిల్లిలోని బీసీ వసతి గృహం పరిధిలో నిర్మించిన ప్రహరీని ప్రారంభిం చారు. కార్యక్రమంలో మండల విస్తరణాధికారి ఎల్.గోపాలరావు, ఉపాధి ఏపీవో ఎం.గౌరీనాధ్, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.