precautions జాగ్రత్తలు అంటే ఇలాగా?
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:54 PM
Is this what precautions look like? ఇది సీతంపేట ఐటీడీఏ పరిధి దోనుబాయి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో పరిస్థితి. నేలపైనే విద్యార్థులు ఇలా పడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

అధికారుల తీరుపై విమర్శలు
పార్వతీపురం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ఇది సీతంపేట ఐటీడీఏ పరిధి దోనుబాయి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో పరిస్థితి. నేలపైనే విద్యార్థులు ఇలా పడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వాస్తవంగా అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కె.కాగుమాను గూడకు చెందిన సవర చలపతి(14) గత నెల 28న బంకర్ బెడ్ ఎక్కుతున్న సమయంలో అది ఒక్కసారిగా ఒరిగి ఆ విద్యార్థిపై పడింది. బలమైన గాయం కావడంతో ఆ విద్యార్థి మృతి చెందాడు. అయితే ఈ ఘటన తర్వాత సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలు చర్చనీయాంశ మవుతున్నాయి. బంకర్ బెడ్స్‌కు అవసరమైన మరమ్మతులు చేపట్టాల్సిన వారు వాటిని పక్కకు పెట్టి ఇలా విద్యార్థులను నేలపై పడుకోబెట్టడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో విష సర్పాలు పొరపాటున ఆశ్రమ పాఠశా లలో ప్రవేశించి విద్యార్థులను కాటేస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్నది అధికారులే చెప్పాల్సి ఉంది.