Share News

నిధులు లేక.. పనులు పూర్తికాక

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:46 PM

మండలంలోని కొండగండ్రేడు జిల్లా పరిషత్‌ పాఠశాల గదుల నిర్మాణం నిధుల కొరతతో నిలిచిపోయింది. దీంతో విద్యార్థులకు అగచాట్లు తప్పడం లేదు.

నిధులు లేక.. పనులు పూర్తికాక
అర్ధాంతరంగా నిలిచిపోయిన కొండగండ్రేడు జిల్లా పరిషత్‌ పాఠశాల భవనం పనులు

గుర్ల, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండగండ్రేడు జిల్లా పరిషత్‌ పాఠశాల గదుల నిర్మాణం నిధుల కొరతతో నిలిచిపోయింది. దీంతో విద్యార్థులకు అగచాట్లు తప్పడం లేదు.

కొండగండ్రేడు జిల్లా పరిషత్‌ పాఠశాల లో 260 మంది విద్యార్థులు చదువుతున్నా రు.ఐదేళ్ల కిందట గ్రామస్థులు పోరాడి పాఠ శాలకు మంజూరుచేయించారు. ఈ నేప థ్యంలో గదులు చాలకపోవడంతో విద్యార్థు లు అగచాట్లు పడుతున్నారు. వసతి సమ స్యపై అధికారులు,ప్రజాప్రతినిధుల దృష్టికి పలుసార్లు తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. దీంతో రూ.25 లక్షలతో భవనాలు మంజూ రుచేసినా పనులు మధ్యలోనే నిలిచి పోయాయి.కనీసం చుట్టూ ప్రహరీ పనులు కూడా పూర్తిచేయలేదు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పాఠశాలదుస్థితిపై నివేదిక పంపినట్లు గ్రామస్థులు తెలిపారు.కాగా పాఠశాలలో భవనం పనులపై నివేదికను జిల్లా అధికారులకు అంద జేసినట్లు హెచ్‌ఎం నారాయణరావు తెలిపారు. అలాగే భవనం నిర్మాణం పూర్తిచే యడానికి నిధుల కొరత ఉందని, అభివృద్ధి చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందని సర్పంచ్‌ సారిక గోవింద చెప్పారు.

Updated Date - Apr 14 , 2025 | 11:46 PM