లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:23 AM
: సుమారు పదేళ్ల విరామం తరువాత సిటీక్లబ్ జిల్లా స్థాయి పోటీలకు ఆతిథ్యమిచ్చింది. అండర్-12, అండర్-16, 30 ప్లస్, 40 ప్లస్, 50 ప్లస్ విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ఐదు విభాగాల్లో 62 మంది పోటీల్లో పాల్గొన్నారు.

విజయనగరం రూరల్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): సుమారు పదేళ్ల విరామం తరువాత సిటీక్లబ్ జిల్లా స్థాయి పోటీలకు ఆతిథ్యమిచ్చింది. అండర్-12, అండర్-16, 30 ప్లస్, 40 ప్లస్, 50 ప్లస్ విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ఐదు విభాగాల్లో 62 మంది పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలను జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, సిటీక్లబ్ ప్రతినిధి రంగారావు దొర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల విరామం తరువాత సిటీక్లబ్‌లో టెన్నిస్ పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. సీనియర్ క్రీడాకారులు సన్యాసిరాజు, రామరావు, శంకరరావు తదితరులు మాట్లాడుతూ, రానున్న కాలంలో ఉత్తరాంధ్ర స్థాయి, రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు ప్రయత్నించాలని సూచించారు.
ఉత్సాహంగా తొలి రోజు పోటీలు
నగరంలోని సిటీక్లబ్‌లోని రెండు క్లే కోర్టుల్లో తొలిరోజు ఉదయం, సాయంత్రం ఐదు విభాగాల్లో 18 మ్యాచ్‌లు జరిగాయి. ఆదివారం రెండో రోజు సెమిఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు హాజరయ్యారు.