Share News

విజయనగరంలో లాన్‌ టెన్నిస్‌ పోటీలు

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:43 PM

విజయనగరంలోని సిటీక్లబ్‌ వేదికగా పదేళ్ల విరామం తర్వాత నిర్వహించిన లాన్‌ టెన్నిస్‌ పోటీలు సోమవారం ముగిశాయి. రెండురోజుల పాటు సింగిల్స్‌, డబుల్స్‌ విభాగంలో జరిగిన ఈ పోటీలకు సంబంధించి అండర్‌-12, అండర్‌-16, 30 ప్లస్‌, 40 ప్లస్‌, 50 ప్లస్‌ విభాగాల్లో జిల్లా వ్యాప్తంగా 62 మంది పాల్గొన్నారు.

విజయనగరంలో లాన్‌ టెన్నిస్‌ పోటీలు
లాన్‌టెన్నిస్‌ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానంచేస్తున్న నిర్వాహకులు:

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని సిటీక్లబ్‌ వేదికగా పదేళ్ల విరామం తర్వాత నిర్వహించిన లాన్‌ టెన్నిస్‌ పోటీలు సోమవారం ముగిశాయి. రెండురోజుల పాటు సింగిల్స్‌, డబుల్స్‌ విభాగంలో జరిగిన ఈ పోటీలకు సంబంధించి అండర్‌-12, అండర్‌-16, 30 ప్లస్‌, 40 ప్లస్‌, 50 ప్లస్‌ విభాగాల్లో జిల్లా వ్యాప్తంగా 62 మంది పాల్గొన్నారు.ఈమేరకు అండర్‌-12 జూనియర్స్‌ విభాగంలో ఎస్‌.కార్తిక్‌ రామ్‌, టి. సాయి చేతన్‌ జయరామ్‌, అండర్‌-16 విభాగంలో పి.సుజిత్‌, జాస్మిన్‌ విజయం సాధిం చారు. 30 ప్లస్‌ సింగిల్స్‌ విభాగంలో ఎస్‌. ప్రశాంత్‌, మహేష్‌, 30 ప్లస్‌ డబుల్స్‌ విభా గంలో బి.మహేష్‌, సీహెచ్‌ హారీష్‌, ఎస్‌.ప్రశాంత్‌, బి.రాహుల్‌, 40 ప్లస్‌ సింగిల్స్‌ విభా గంలో సుదర్శన్‌, మల్లి, బి.రఘునాథ్‌, ఎం.మధు, 50 ప్లస్‌ విభాగంలో జీవీసన్యాసిరాజు, పీఎన్‌ రాజు, టి.రామారావు, కేవీ రామారావు విజయం సాధించారు. సిటీక్లబ్‌ ప్రతినిధు లు రంగారావు దొర, సన్నిబాబు దొర, సీనియర్‌ టెన్నిస్‌ క్రీడాకారులుసన్యాసిరాజు, రామారావు, శంకరరావులతో పాటు గంటా వైభవ్‌, కౌశిక్‌, సాథ్విక్‌ తదితరులు పోటీల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించారు.

Updated Date - Apr 14 , 2025 | 11:43 PM