Share News

ఈఎస్‌ఐ డిస్పెన్సరీపై ఎమ్మెల్యే ఆరా

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:08 AM

బొబ్బిలి పోలీసు స్టేషన్‌ రోడ్డులో గల ఈఎస్‌ఐ డిస్సెన్సరీని ఎమ్మెల్యే బేబీ నాయన మంగళవారం తనిఖీ చేశారు.

ఈఎస్‌ఐ డిస్పెన్సరీపై ఎమ్మెల్యే ఆరా

బొబ్బిలి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పోలీసు స్టేషన్‌ రోడ్డులో గల ఈఎస్‌ఐ డిస్సెన్సరీని ఎమ్మెల్యే బేబీ నాయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ డిస్పెన్సరీ చాలీచాలని వసతులతో ప్రైవేట్‌ భనవంలో నడుస్తోంద ని, తగరపువలసకు, బొబ్బిలికి ఒకే వైద్యుడు పని చేస్తున్నారని, కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అంద డం లేదని కార్మికవర్గాల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే డిస్పెన్సరీని పరిశీ లించి, రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బందిని అన్ని విష యాలపై ఆరా తీశారు. డాక్టరు వారానికి మూడు రోజు లు వస్తుంటారని, మిగిలిన రోజులు తగరపువలసలో సేవలందిస్తారని సిబ్బంది వివరించారు. విశాలమైన స్థలంలో సొంతభవనం నిర్మించుకునేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్‌ను కోరతా మని ఎమ్మెల్యే సిబ్బందికి హామీ ఇచ్చారు. కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటా మని, పూర్తిస్థాయి డ్యూటీ డాక్టరును నియమించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారితో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. ఇరుకైన గదిలో ఉన్న ఈ డిస్పెన్సరీని తక్షణం తరలించాలని కోరారు. మందుల కోసం ఇండెంట్‌ ఇవ్వాలన్నారు. పూర్తి స్థాయి వైద్యుడు, ప్రభుత్వ స్థలం తదితర అంశాలకు సంబంధించి చర్చించేందుకు స్థానిక ఎంపీ కలిశెట్టి అప్ప లనాయుడు, తహసీల్దార్‌తో కలిసి జాయింట్‌ మీటింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయ కులు రాంబార్కి శరత్‌బాబు, సుంకరి సాయిరమేష్‌, నంది హరి, గొర్లె అంకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:08 AM