Share News

మరిన్ని విజయాలు సాధించాలి

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:25 AM

అంతర్జాతీయ పారా అథ్లెట్‌ కిల్లక లలిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆకాంక్షించారు.

మరిన్ని విజయాలు సాధించాలి

పార్వతీపురం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యో తి): అంతర్జాతీయ పారా అథ్లెట్‌ కిల్లక లలిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం స్థానిక కలెక్టర్‌ చాంబర్‌లో ఆమెను దుశ్శాలువతో సత్కరించి, రన్నింగ్‌ షూస్‌ను బహూకరించారు. భవిష్యత్తు లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లా పేరును ఇనుమడిపంచేయాలని కలెక్టర్‌ అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం గొల్లలంక గ్రామా నికి చెందిన లలిత తల్లిదండ్రులు బోర్జ, సీతమ్మలను కలెక్టర్‌ ముందుగా అభినందించా రు. ఈసందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లలిత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు సాధించిన విజయాలపై కలెక్టర్‌కు వివరించా రు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్‌గేమ్స్‌ కార్యదర్శి ఎం.మురళీమోహన్‌, సీనియర్‌ వ్యాయామ ఉపాధ్యాయులు డి.టి.గాంధీ, క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు, పీడీ, పీఈటీ అసోసియేషన్‌ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:25 AM