Revenue Staff రెవెన్యూ సిబ్బందికి పదోన్నతులు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:43 AM
Promotions for Revenue Staff ఉమ్మడి జిల్లా పరిధిలోని రెవెన్యూ సిబ్బందికి పదోన్నతి కల్పించారు. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో 11 మంది జూనియర్ సహాయకులను సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పిస్తూ విజయనగరం జేసీ ఎస్.సేతు మాధవన్ ఆదేశాలిచ్చారు.

గరుగుబిల్లి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా పరిధిలోని రెవెన్యూ సిబ్బందికి పదోన్నతి కల్పించారు. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో 11 మంది జూనియర్ సహాయకులను సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పిస్తూ విజయనగరం జేసీ ఎస్.సేతు మాధవన్ ఆదేశాలిచ్చారు. భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డి.సురేష్‌ను విజయనగరానికి, గరివిడి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఎం.కిరణ్‌కుమార్‌ను విజయనగరం, గరుగుబిల్లికి చెందిన గులిపల్లి రవితేజకు పార్వతీపురం, విజయనగరంలో పనిచేస్తున్న బి.సతీష్‌కుమార్‌కు విజయనగరానికి, కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలోని ఎస్.షణ్ముఖరావుకు విజయనగరం, మన్యం కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న టి.రామారావుకు పార్వతీపురం కేటాయించారు. సీతానగరానికి సంబంధించి డి.షణ్ముఖ పట్నాయక్‌ను పార్వతీపురానికి, విజయనగరం ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న కె.భరత్‌కుమార్‌ను విజయనగరం కలెక్టరేట్‌కు, విజయగరం ఆర్డీవోలో పనిచేస్తున్న బి.రామమూర్తి శాస్త్రిని ఆ జిల్లా కలెక్టరేట్‌కు, జియ్యమ్మవలసకు చెందిన సీహెచ్ ఆదిలక్ష్మిని పార్వతీపురం, మన్యం కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఎం.మంజుషకు పార్వతీపురం ఆర్డీవో కార్యాలయానికి కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజుల్లో వారు విధుల్లో చేరనున్నారు.