Phāmpāṇḍs ఫాంపాండ్స్‌తో భూమి సారవంతం
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:17 PM
Soil Fertility with Phāmpāṇḍs ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేస్తున్న ఫాంపాండ్స్ సాగు భూములను సారవంతంగా చేస్తాయని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణభరత్ గుప్తా తెలిపారు. మంగళవారం విక్రాంపురంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు.

కొమరాడ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేస్తున్న ఫాంపాండ్స్ సాగు భూములను సారవంతంగా చేస్తాయని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణభరత్ గుప్తా తెలిపారు. మంగళవారం విక్రాంపురంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. పశువుల నీటి తొట్టెల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం తమ్మన్నదొరవలసలో మినీ గోకులాలను పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు. నందాపురంలో ఫాంపాండ్స్‌ను తనిఖీ చేసిన ఆయన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఫాంపాండ్స్‌తో సాగులో నీటి కొరతను తీర్చి పంటల దిగుబడిని పెంచడం, తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. వాటితో వర్షపు నీటిని సేకరించి సాగుతో పాటు పశువులకు అందించొచ్చని, చేపల పెంపకం వంటివి కూడా చేపట్టొచ్చని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో 411 నీటి తొట్టెలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట డ్వామా పీడీ కె.రామ చంద్రరావు తదితరులు ఉన్నారు.