వార్డెన్‌ను సస్పెండ్ చేయాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:09 AM
అనసభద్ర ఏకలవ్య మోడల్ రెసిడె న్సీ స్కూల్‌లో విద్యార్థులను కొట్టిన వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాల ని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు.

మక్కువ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): అనసభద్ర ఏకలవ్య మోడల్ రెసిడె న్సీ స్కూల్‌లో విద్యార్థులను కొట్టిన వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాల ని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి పాఠశాలలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్త దుస్తులు పోవడంతో విద్యార్థులను బాధ్యులను చేస్తూ వార్డెన్ వారిని తీవ్రంగా కొట్టినట్టు వారి తల్లిదండ్రులకు విషయం తెలిసింది. దీంతో తల్లిదండ్రులు మంగళవా రం ఆ పాఠశాలకు వెళ్లి, ప్రిన్సిపాల్ ఎర్రినాయుడును నిలదీశారు. వారి వెంట ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు. దీంతో ప్రిన్సిపాల్ సంబంధిత వార్డెన్‌ను ప్రశ్నించగా విద్యార్థులను కొట్టలేద ని, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా కొంతసేపు నిలబెట్టానని తెలిపారు. అయి తే విద్యార్థులందరూ ముందుకు వచ్చి వార్డెన్ కొట్టారని తెలిపారు. వార్డెన్ పై చర్యలు తీసుకోకపోతే ఐటీడీఏ పీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని రవి కుమార్ హెచ్చరించారు.