Water Troughs మూగజీవాలకు నీటి తొట్టెలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:24 PM
Water Troughs for Animals వేసవి ఎండల దృష్ట్యా మూగజీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామాల్లో ప్రత్యేకంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం నిధులతో వాటిని నిర్మించాలని సూచించింది.

జిల్లాలో నిర్మాణాలకు చర్యలు
గరుగుబిల్లి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): వేసవి ఎండల దృష్ట్యా మూగజీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామాల్లో ప్రత్యేకంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం నిధులతో వాటిని నిర్మించాలని సూచించింది. ఈ మేరకు పంచాయతీల్లో వాటి నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జిల్లాలోని 15 మండలాల్లో 411 నీటి తొట్టెలను నిర్మించేందుకు ఉపాధి సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఒక నీటి తొట్టె నిర్మాణానికి రూ. 30 వేలు మంజూరు చేయనున్నారు. కాగా ఇప్పటికే గ్రామాల్లో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. అయితే స్థల సమస్య ఉన్న చోట్ల స్థానిక పంచాయతీ ప్రతినిధులు చొరవ చూపాల్సి ఉంది. ‘జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఏప్రిల్ పదో తేదీ లోగా నీటి తొట్టెల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంంది. స్థల సమస్య ఉన్న చోట పంచాయతీ ప్రతినిధులు స్పందించి ముందుకు రావాలి. నీటి తొట్టెల నిర్మా ణాలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపాధి సిబ్బందిపై చర్యలు తప్పవు.’ అని డ్వామా పీడీ కె.రామచంద్రరావు తెలిపారు.