Share News

Leave It Like This? ఇలానే వదిలేస్తారా?

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:33 PM

Will You Leave It Like This? సాలూరు మున్సిపాల్టీలో పారిశుధ్య నిర్వహణ కోసం స్వచ్చంధ్ర కార్పొరేషన్‌ నిధులతో కొనుగోలు చేసిన వాహనాలకు మోక్షం లభించడం లేదు. నెలలు గడుస్తున్నా.. వినియోగానికి నోచుకోవడం లేదు. వివిధ కారణాలతో కొత్త వాహనాలను ఇలా వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 Leave It Like This? ఇలానే వదిలేస్తారా?
నిరుపయోగంగా ఉన్న ట్రాక్టర్‌

సాలూరు, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): సాలూరు మున్సిపాల్టీలో పారిశుధ్య నిర్వహణ కోసం స్వచ్చంధ్ర కార్పొరేషన్‌ నిధులతో కొనుగోలు చేసిన వాహనాలకు మోక్షం లభించడం లేదు. నెలలు గడుస్తున్నా.. వినియోగానికి నోచుకోవడం లేదు. వివిధ కారణాలతో కొత్త వాహనాలను ఇలా వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తాగునీటి అవసరాల కోసం ట్యాంకర్‌తో ఓ ట్రాక్టర్‌ను రూ.పది లక్షలతో కొనుగోలు చేశారు. అయితే డ్రైవర్‌ లేని కారణంగా ప్రస్తుతం అది మున్సిపల్‌ కార్యాలయం ఎదుట దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది. మున్సిపాల్టీలో మరుగుదొడ్ల శుభ్రత కోసం 13 నెలలు కిందట కేంద్రం పంపిన ఓ వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేయలేదు. మరోవైపు డ్రైవర్‌ లేడని ఇప్పటికీ దానిని వినియోగంలోకి తేలేదు. ఆ వాహనాన్ని అద్దెకు ఇచ్చి మున్సిపాల్టీకి ఆదాయం సమకూర్చాలని గతంలో కౌన్సిల్‌ సభ్యులు తీర్మానం చేసినా.. దానిని అమలు చేయలేదు. కాగా రూ.40 లక్షలతో ఏడాది కిందట కొనుగోలు చేసిన ఎక్స్‌కవేటర్‌ను తాత్కలిక డ్రైవర్‌తో అప్పుడప్పుడూ వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నూతన వాహనాలు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఇన్‌చార్జి కమిషనర్‌ బీవీ ప్రసాద్‌ను వివరణ కోరగా.. ‘కొత్తగా వచ్చిన వాహనాలను వినియోగంలోకి తెస్తాం. డ్రైవర్ల కోసం చైర్‌పర్సన్‌తో చర్చించాం. త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి డ్రైవర్ల కోసం టెండర్లు పిలుస్తాం.’ అని ఆయన తెలిపారు.

Updated Date - Apr 13 , 2025 | 11:33 PM