గోవుల మరణాలపై వైసీపీ అసత్య ప్రచారం
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:11 AM
టీటీడీలో గోవుల మరణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం సాలూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

సాలూరు,ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): టీటీడీలో గోవుల మరణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం సాలూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలంలో గోమరణాలు ఎన్ని జరిగాయో అందరికి తెలుసని పేర్కొన్నారు. గతంలో వేంకటేశ్వరునిపై వైసీపీ నాయకులు అనేక విమర్శలు చేశారని గుర్తుచేశారు. గోశాలలో వంద ఆవులు చని పోయాయని వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని తెలిపారు. గోసంరక్షణ శాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు గోవులు సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్ష జరుగుతుందని చెప్పారు. టీటీడీ గోశాలలో 260 మందికిపైగా ఉద్యోగులు పని చేసి గోవులను సంరక్షిస్తున్నారని, ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హితవు పలి కారు.గోశాలలో ఉన్న 2,668 ఆవులకు జియోట్యాగ్ చేసి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారని, ఆవులకు జియోట్యాగ్ తీసేశారని వైసీపీ నాయ కులు విషప్రచారం చేయడం సరికాదన్నారు. మతవిద్వేశాలు రెచ్చగొట్టడంతోపాటు టీటీడీప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేస్తుండడంతో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.