అంబేడ్కర్ మార్గంలో పయనించండి
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:00 AM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించేందుకు ప్రతీ ఒక్కరు పునరంకితమవ్వాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు నిచ్చారు.

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్
అంబేడ్కర్‌కు ఘన నివాళులు
ఏలూరు/ఏలూరు టూటౌన్/ఏలూరు క్రైం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించేందుకు ప్రతీ ఒక్కరు పునరంకితమవ్వాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు నిచ్చారు. ఏలూరు పాతబస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ 134వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని వికసిత భారత్, స్వర్ణాంధ్ర కలల సహకారానికి పాటు పడాలన్నారు. ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, జడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ ఎం.పార్థసారథి, డిప్యూటీ మేయర్ ఉమామహేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విక్రమ్ కిశోర్, ఆర్డీవో అచ్యుత్ అంబరీశ్ తదితరులు పాల్గొన్నారు.