Share News

ChandraBabu: ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..

ABN , Publish Date - Apr 08 , 2025 | 09:21 PM

ChandraBabu: కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీకోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతోన్నాయి. అందులోభాగంగా శ్రీసీతారామ స్వామి కళ్యాణోత్సవం జరగనుంది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంతకుముందు స్వామి వారికి ఆయన ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ChandraBabu: ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..
AP CM Chandrababu Naidu

అమరావతి, ఏప్రిల్ 08: కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11వ తేదీ అంటే.. శుక్రవారం రాత్రి సీతారామ కళ్యాణోత్సవం జరగనుంది. ఈ కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. . ఆ రోజు సాయంత్రం 6.00 గంటలకు సీఎం చంద్రబాబు ఒంటిమిట్ట చేరుకోనున్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఆ తర్వాత.. 6.45 గంటల నుంచి 8.30 గంటల వరకు జరగనున్న సీతారామ కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. అనంతరం 8.40 గంటలకు స్థానిక టీటీడీ గెస్ట్ హౌస్‌కు చేరుకుని.. రాత్రికి అక్కడే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. ఆ మరునాడు అంటే ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 9.00 గంటలకు సీఎం చంద్రబాబు కడప ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.


అయితే ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు హెలికాఫ్టర్‌లో ఉమ్మడి కృష్ణాజిల్లా ( ప్రస్తుతం ఏలూరు జిల్లా) లోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను చేరుకుంటారు. అక్కడ సీఎం చంద్రబాబుకు స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం బీసీ వర్గాల ప్రజలతో వారి పని ప్రదేశంలోనే కలిసి మాట్లాడనున్నారు.


అనంతరం 11.30 గంటలకు స్థానిక ప్రజా వేదిక వద్ద ప్రజలతో ఆయన ముఖాముఖీ నిర్వహించనున్నారు. ఆ క్రమంలో పార్టీ కేడర్‌తో సైతం సీఎం చంద్రబాబు సమావేశమవనున్నారు. ఆ తర్వాత తిరిగి 2.30 గంటలకు హెలికాఫ్టర్‌లో విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు. మూడున్నరకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి కడపకు సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కడప ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని.. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.00 గంటలకు ఒంటిమిట్టలోని టిటిడి గెస్ట్ హౌస్‌కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. అంటే.. ఏప్రిల్ 11, 12 తేదీల్లో సీఎం చంద్రబాబు ఏలూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Pawan Kalyan: కుమారుడు హెల్త్‌పై పవన్ ఫస్ట్ రియాక్షన్..

Manchu Family: మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ.. పోలీస్ స్టేషన్‌లో మనోజ్

Somu Veerraju: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు


Dilshuknagar Bomb Blast: దోషుల తరఫున వాదించింది ఎవరంటే..

Chandrababu: చంద్రబాబుకు సొంత ఇల్లు..

Jaipur Bomb Blast Case: జైపూర్ బాంబు పేలుళ్ల కేసు: దోషులకు జీవిత ఖైదు

Updated Date - Apr 08 , 2025 | 09:21 PM