Share News

దామరచర్లలో వివాదం

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:53 AM

మండల పరిధిలోని దామర చర్ల గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివా దం పెద్ద కొట్లాటకు దారి తీసింది.

దామరచర్లలో వివాదం
గాయపడిన దుర్గయ్య

కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు

ముగ్గురికి తీవ్ర గాయాలు.. కానిస్టేబుల్‌కు చెయ్యి విరిగింది

పోలీసు పికెట్‌ ఏర్పాటు.. పర్యవేక్షిస్తున్న పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు

కుక్కునూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్ర జ్యోతి):మండల పరిధిలోని దామర చర్ల గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివా దం పెద్ద కొట్లాటకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలతో ఒకరిపై ఒక రు దాడి చేసుకున్నారు. పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేయగా పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణ జరిపారు. పోలీసులు తెలిపిన వివ రాలివి.. శనివారం రాత్రి దామర చర్లలో రహదారి పక్కన ఉన్న ఓ బడ్డీకొట్టు సమీపంలో రెండు సామా జిక వర్గాల యువకుల ఽమధ్య చిన్న గొడవ తలెత్తింది. ఈ క్రమంలో ఒక యువ కునిపై దాడి జరిగింది. ఈమేరకు రెండువైపులా ఆయా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు వచ్చి ఘర్షణ పడ్డారు. అనంతరం కర్రలతో కొట్టుకున్నారు. అనంతరం గ్రామపెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సర్దుమనిగింది. ఆదివా రం ఉదయం గ్రామంలోని ఒక పెద్దమనిషి దగ్గర ఇరు సామాజిక వర్గాల పెద్దలు రాజీ చేసుకున్నారు.

ఆదివారం మధ్యాహ్నం మరోసారి సమీప గ్రామంలో రెండు సామాజిక వర్గాల వ్యక్తులు తారసపడి పరస్పరం దూషించు కున్నారు. ఈ గ్రా మంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తి పరస్పరం కర్రలతో దాడి చేసుకు న్నారు. పోలీసులు చెల్లాచెదురు చేస్తు న్నప్పటికి కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ దాడిలో ఎస్‌.ప్రసాద్‌, దుర్గయ్య, సతీశ్‌ అనే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో ముడియం శ్రీనివాస్‌ అనే కానిస్టేబుల్‌ కొట్లాడుకుం టున్నవారిని చెల్లాచెదురు చేస్తూ కింద పడ డంతో చెయ్యి విరిగింది. అనంతరం వీరిని ప్రాథమిక చికిత్స నిమిత్తం సమీప అమరవరం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. ఈ క్రమంలో గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు గ్రామంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సీఐ రమేశ్‌బాబు, ఎస్‌ఐ రామకృష్ణ, కుక్కునూరు, వేలేరుపాడు పోలీస్‌ సిబ్బంది గ్రామంలో పర్యవేక్షిస్తూ వేలేరుపాడు పోలీసులు గ్రామంలో పహారా కాస్తున్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:53 AM