Share News

ఇంటర్‌లో అద్వితీయం

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:10 AM

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సరికొత్త రికార్డును నమోదు చేశా రు. దశాబ్దకాలంలో అందుకోలేని ఉత్తీర్ణతను సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపుల బాలబాలికలు సాధించి చరిత్రను సృష్టించారు.

ఇంటర్‌లో అద్వితీయం
ఏలూరులో విద్యార్థినుల విజయదరహాసం

సెకండియర్‌లో 86 శాతం, ఫస్టియర్‌లో 71 శాతం మంది పాస్‌

ఒకేషనల్‌ ఫలితాల్లోనూ అదేజోరు

82 శాతం ఉత్తీర్ణతతో బాలికలు టాప్‌స్థానం

సంఖ్యాపరంగా ప్రైవేటు కళాశాలల విద్యార్థులదే హవా

మళ్లీ చతికిలపడిన హైస్కూల్‌ ప్లస్‌లు

15 నుంచి సప్లిమెంటరీ విద్యార్థులకు రెమిడియల్‌ క్లాసులు

ఏలూరు అర్బన్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సరికొత్త రికార్డును నమోదు చేశా రు. దశాబ్దకాలంలో అందుకోలేని ఉత్తీర్ణతను సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపుల బాలబాలికలు సాధించి చరిత్రను సృష్టించారు. ఫలితాల్లో రాష్ట్ర సగటు కంటే అదనపు ఉత్తీర్ణతను అందుకున్న ఏలూరు జిల్లా విద్యార్థులు గతేడాది సాధించిన పాస్‌ పర్సంటేజీకి మించి 10.70శాతం అధిక ఉత్తీ ర్ణతతో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొత్తం 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాకు రాష్ట్రస్థాయిలో ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 10వ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 9వ స్థానం లభించాయి. గతేడాది కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వం ఇంటర్మీడి యట్‌ విద్యపై విద్యాసంవత్సరం ప్రారం భం నుంచే ప్రత్యేక కార్యక్రమాలతో కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో యోహాన్‌, డీవీఈవో ప్రభాకరరావు విశ్లేషించారు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్‌ విద్యార్థులు జనరల్‌, ఒకేషనల్‌ విభాగాల్లో మొత్తం 30,671 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షలు రాసిన వారిలో 23,524 మంది (77శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగం బాల బాలికలు 15,288 మందికి 10,842 మంది (71శాతం) పాస్‌కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 12,086 మందికి 10,376 మంది (86శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ విభా గంలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,880 మంది హాజరుకాగా 1,250 మంది (66 శాతం), ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,417 మందికి 1,191 మంది (84శాతం) పాస్‌ అయ్యా రు. మొత్తం మీద పరీక్షలు రాసిన 13,085 మంది బాలురలో 9,240 మంది(71శాతం), 17,586 మంది బాలికల్లో 14,419 మంది (82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వం ఇంట ర్‌ ఫలితాలను ఈ ఏడాది వాట్సాప్‌ నుంచే తెలుసుకునే వెసులుబాటు కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు నిమిషాల వ్యవధిలోనే వేగంగా తమ మార్కులను తెలుసుకునే అవకాశం లభించింది.

సంక్షేమ విద్యార్థులు సూపర్‌..హైస్కూల్‌ ప్లస్‌లు డీలా

జిల్లాలో మొత్తం 137 జూనియర్‌ కళాశాలలున్నాయి. తాజా ఫలితాల్లో ఇంటర్‌ పరీక్షలకు హాజరైన ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసి డెన్షియల్‌ కళాశాలల ప్రథ మ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 923 మందిలో అత్యధికంగా 856 మం ది ఉత్తీర్ణులై 92.74 శాతం పాస్‌పర్సం టేజీతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తదు పరి 78 ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ కళాశాలల నుంచి 24,957 మంది పరీక్షలు రాయగా 79.31 శాతం ఉత్తీర్ణతతో 19,794 మంది విజయ దుందుబి మోగించారు. ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ విద్యార్థులు72.34 శాతం ఉత్తీర్ణతతో 429 మంది, 3 కేజీబీవీల నుంచి 72 మంది పాస్‌తో 70.59 శాతం, 19 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల నుంచి 1768 మంది ఉత్తీర్ణతతో 61.03 శాతం, 2 ఎయిడెడ్‌ కళాశాలల నుంచి 352 మంది ఉత్తీర్ణ తతో 56.87 శాతం ఫలితాలను సాధించాయి. ఇక ఇంటర్‌ విద్య కోసం మండలానికో హైస్కూ ల్‌ ప్లస్‌ చొప్పున మూడేళ్లక్రితం ప్రారంభించిన కళాశాలలు జిల్లాలో 26 ఉండగా, వీటి నుంచి ఇంటర్‌ పరీక్షలకు హాజరైన ప్రథమ సంవత్సరం విద్యార్థులు 409 మందిలో కేవలం 139 మంది (33.99శాతం), ద్వితీయ సంవత్సరం విద్యార్థు లు 171 మందిలో 114 మంది (66.67శాతం) ఫలితాలతో మొత్తంమీద 43.62 శాతం ఉత్తీర్ణతతో వరుసగా మూడో సంవత్సరంలోనూ అట్టడుగుస్థానంలో నిలిచాయి.

15 నుంచి క్లాసులు

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మే 12 నుంచి 20 వరకు నిర్వహించనున్న అడ్వాన్స్డ్‌ సప్లిమెం టరీ థియరీ, 28 నుంచి జూన్‌ 1 వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరుగుతాయని ఆర్‌ఐవో యోహాన్‌ తెలిపారు. రెగ్యులర్‌ పరీక్షల ఫలితాలకు సం బంధించి రీ కౌంటింగ్‌ కోరుకునే విద్యార్థులు పేపర్‌కు రూ.260, రీవెరిఫికేషన్‌కు రూ.1,300 చొప్పున చెల్లించి వారు చదువుతున్న కళా శాల నుంచే దరఖాస్తు చేసుకోవాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షార్థులు ఈ నెల 15నుంచి 22లోగా థియరీ పరీక్షలకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275లను తమ కళాశాలలో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా సప్లిమెంటరీ పరీక్ష లకు హాజరయ్యే విద్యా ర్థుల కోసం ఈ నెల 15 నుంచి అన్ని కళాశా లల్లో రెమిడియల్‌ క్లాసు లను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించ డానికి ఏర్పాట్లు చేశామని డీవీఈవో ప్రభాకరరావు తెలిపారు.

‘సంకల్ప్‌’ సిద్ధించినట్టే

అధికారంలోకి వచ్చిన తొలిఏడాది నుంచే ప్రభుత్వం ఇంటర్‌విద్యపై ప్రారంభించిన ప్రత్యేక కార్యా చరణలో భాగంగా సకాలంలో పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు ఇవ్వడంతోపాటే, కళాశాలల పనివేళలను పెంచి ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులను నిర్వహించడంతో మెరుగైన ఫలితాలు రావడానికి కారణమైందని చెప్పవచ్చు. ప్రధానంగా రాష్ట్రప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థుల కోసం ప్రారంభించిన ‘సంకల్ప్‌–2025’ కార్యాచరణ విజయవంతమైందని తాజా ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని కళా శాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం, తొలిసారిగా ఇంటర్‌ విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌, క్వశ్చన్‌ బ్యాంక్‌, కేర్‌ టేకర్లతో పర్యవేక్షణలో స్టడీఅవర్లు నిర్వహించడం ఉత్తమ ఫలి తాలను తెచ్చిపెట్టిందని జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:10 AM