పేరుపాలెం బీచ్‌లో యువకుడి మృతి
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:44 AM
పేరుపాలెం బీచ్‌లో యువకుడు మృతి చెందాడు.

మొగల్తూరు, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): పేరుపాలెం బీచ్‌లో యువకుడు మృతి చెందాడు. సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి యడ్ల చిట్టిబాబుకు మారుడు యడ్ల మధుబాబు (23) డిగ్రీ పూర్తిచేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. సోమవారం తన స్నేహితులతో కలిసి పేరుపాలెం బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు లోపలికి కొట్టుకువెళ్లి గల్లంతయ్యాడు. మిత్రులు చేయందిం చినప్పటికి అలల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. కొద్దిసేపటి తర్వాత విగతజీవిగా ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. స్నేహితులు, స్థాని కులు 104కు సమాచారం అందించారు. బీచ్ వద్దకు చేరుకున్న సిబ్బంది పరీక్షించి మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మధుబాబు మృతదేహన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, సీపీఎం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం, నాయకులు సందర్శించి నివాళులర్పించారు.