Share News

ధాన్యం స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:45 PM

రాష్ట్రంలో అన్నదాతలకు ప్రయోజనం కలిగే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, నిర్దేశిత రైస్‌మిల్లు అనేది లేకుండా రైతులు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ము కోవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

ధాన్యం స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు, చిత్రంలో జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి

పాలకొల్లు రూరల్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్నదాతలకు ప్రయోజనం కలిగే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, నిర్దేశిత రైస్‌మిల్లు అనేది లేకుండా రైతులు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ము కోవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శివదేవుని చిక్కాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం ధాన్యం విక్రయంలో రైతులను అనేక కష్టాలు పాలు చేసిందన్నారు. తేమ పేరుతో కిలోల కొద్దీ ధాన్యాన్ని దోచేసిం దని నిమ్మల విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన ధాన్యం సొమ్ము రూ1654 కోట్లు చంద్రబాబు చెల్లించార న్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతులకు బ్యాంకు ఖాతాలో ఽసొమ్ములు జమ అవుతాయన్నారు. రైతులకు మేలు చేకూర్చేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో దాసి రాజు, జిల్లా వ్యవసాయశాఖాధికారి జడ్డు వెంకటేశ్వర్లు, జిల్లా సహకార శాఖ అధికారి ఎం.నాగరాజు, సర్పంచ్‌ దిడ్ల మణివజ్రం, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 11:45 PM