Share News

ఇళ్లు.. ఇంటి స్థలాలు అమ్మేస్తున్నారు!

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:42 AM

పేదలకు ఇంటి స్థలాల పేరిట అప్పటి వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల్లో అనర్హులకు పెద్ద పీట వేసింది.

ఇళ్లు.. ఇంటి స్థలాలు అమ్మేస్తున్నారు!
టి.నరసాపురం మండలం బొర్రంపాలెం కాలనీలో నిర్మితమైన ఇళ్లు

జగనన్న కాలనీలో అనర్హులకే అందలం

కాలనీల్లో ఇళ్లు.. స్థలాల బేరసారాలు

రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు..

ఇప్పటికే చేతులు మారిన స్థలాలు

అర్హులకు న్యాయం చేయాలని వినతి

పేదలకు ఇంటి స్థలాల పేరిట అప్పటి వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల్లో అనర్హులకు పెద్ద పీట వేసింది. అర్హులకు ఇళ్లు, స్థలాలు అందలేదు. అప్పటికే ఇళ్లు, స్థలాలు ఉన్నవారికి కూడా కాలనీల్లో మళ్లీ కేటాయించారు. కొందరు పేదలు ఆర్థిక స్తోమత లేక ఇంటి నిర్మాణం చేపట్టలేదు. అప్పటికే ఇళ్లు ఉన్నవారు కాలనీల్లో నిర్మాణం ఊసే ఎత్తలేదు. అవసరం ఉన్న వారు అప్పులు చేసి ఇళ్లు నిర్మించారు. ఆయా కాలనీల్లో స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అనర్హులకు కేటాయించిన స్థలాలు అమ్మకానికి పెట్టారు.

టి.నరసాపురం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రతీ పేదకు లబ్ధిచేకూరుస్తామంటూ గత వైసీపీ ప్రభు త్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో అనర్హులకే అవకాశం కల్పించారు. అప్పటి పాల కులు, అధికార యంత్రాంగం ఏకమై అనేక మంది అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇళ్లు ఉన్నవారికే ఇళ్లు, స్థలా లు కేటాయించడంతో కొందరు నిర్మాణం ఊసే ఎత్త లేదు. మరికొందరు స్థలాలు, ఇళ్లను రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు రేటు కట్టి మరీ విక్రయిం చినట్లు ఆరోపణలు వచ్చాయి. టి.నరసాపురం మండలం 15 గ్రామ పంచాయతీల్లో 34 లేఅవుట్లలో సుమారు 1100మంది లబ్ధిదారులను గుర్తించారు. అనర్హులకే లబ్ధి చేకూరిందని విమర్శలు వచ్చాయి.

నిర్మాణాలు అంతంత మాత్రం

పేదలు ఇళ్లు నిర్మించుకునే ప్రయత్నం చేసినా ప్రభుత్వ సాయం చాలక మధ్యలోనే నిర్మాణం నిలిపి వేశారు. అనర్హులు నిర్మాణం జోలికి పోలేదు. అక్కడ క్కడా నిర్మాణాలు చేపట్టిన అనర్హులు తర్వాత అమ్మ కాలకు తెర తీశారు. మధ్యలో ఇళ్ల నిర్మాణం నిలిచిపో యిన వారికి ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం సాయం పెంచినా ఇళ్ల నిర్మాణంలో పురోగతి లేకపో గా విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయని పలువు రు ఆరోపిస్తున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం మం జూరు చేసిన పూర్తయిన గృహాలకు వైసీపీ ప్రభుత్వం సాయం ఆపేయడంతో పేదలు ఇబ్బం దులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో అనర్హులకు ఇళ్లు మంజూరు చేశారని వాటిలో చాలా ఇళ్లు ఇప్పటికే చేతులు మారాయని క్రయ, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని పలువురు చెబుతున్నారు. స్థలాలు, ఇళ్ల విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసా రధికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొండపల్లి రవి వినతిపత్రం అందజేశారు.

రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ అధికారులు స్పం దించి నిర్మాణాలు చేపట్టని వారు, స్థలాలు విక్రయిం చిన వారి ఇళ్లను స్వాధీనం చేసుకుని అర్హులకు పంచాలని కోరుతున్నారు.

విక్రయించిన ఇళ్లను స్వాధీనం చేసుకోవాలి

జగనన్న కాలనీల్లో కొన్ని ఇళ్లు విక్రయాలు జరుగుతు న్నాయి. అనర్హులకు ఇళ్లు కేటాయించారు. అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి అనర్హులకు ఇచ్చిన ఇళ్లు రద్దుచేసి విక్రయాలు జరిపిన గృహాలు స్వాధీనం చేసుకోవాలి.

– కొండపల్లి రవి

అర్హులకు కేటాయించాలి

ఇళ్లు లేని పేదలు నానా అవస్థలు పడుతున్నారు. అన ర్హులకు ఇళ్లు ఇచ్చి పేదలను అన్యాయం చేస్తున్నారు. నిర్మాణాలు చేపట్టని స్థలాలు స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలి. అర్హులకు న్యాయం చేయాలి.

– మడకం కుమారి, సీపీఎం నాయకురాలు

Updated Date - Apr 09 , 2025 | 12:42 AM