Share News

ఫోన్‌ ఎక్కువగా చూడొద్దు అన్నందుకు కుమార్తె ఆత్మహత్య

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:19 AM

ఫోన్‌ ఎక్కువగా చూడొద్దని తల్లిదండ్రు లు మందలించడంతో కుమార్తె మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.

ఫోన్‌ ఎక్కువగా చూడొద్దు అన్నందుకు కుమార్తె ఆత్మహత్య

చాట్రాయి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి):ఫోన్‌ ఎక్కువగా చూడొద్దని తల్లిదండ్రు లు మందలించడంతో కుమార్తె మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏలూరు జిల్లా చాట్రాయి లో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. చాట్రాయి పవర్‌పేటలో ఉదయం కూలి పనులకు వెళుతూ.. సాయంత్రం చిన్న హోటల్‌ నడుపుకుంటున్న మరీదు శ్రీనివాసరావు, జ్యోతి దంపతుల కుమార్తె ప్రవల్లిక విస్సన్నసేటలోని ఓ కాలేజిలో డి ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఇటీవల ఆమె ఫోన్‌ ఎక్కువగా చూస్తుండటంతో చదువు పాడవుతుందని ఆందోళన చెందిన తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి కుమార్తెను మందలించారు. దీనితో ఆమె శనివారం ఉదయం తల్లిదండ్రులు ఉపాధి హామీ పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి పంపారు.

Updated Date - Apr 13 , 2025 | 01:19 AM