అర్జీల పరిష్కారం పెండింగ్ పెట్టొద్దు
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:27 AM
పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలో పరి ష్కరించాలని కలెక్టర్ నాగరాణి అధికారులకు సూచించారు.

అధికారులతో పశ్చిమ కలెక్టర్ సమీక్ష
భీమవరంటౌన్, ఏప్రిల్ 9 (ఆంద్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ నాగరాణి అధికారులకు సూచించారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే, ఇళ్ల పట్టాలు, వాటర్ టాక్స్, ఐవీఆర్‌ఎస్ అంశాలపై అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రీ సర్వే పనులను వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాలు అందజేయాలన్నారు.
ఇళ్ల నిర్మాణం వేగవంతం చెయ్యండి
బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణ శాఖ ఈఈ, డీఈ, ఏఈ, తహసీల్దార్, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందిస్తుందని, వారికి అవగాహన కల్పించాలన్నారు. జేసీ టి.రాహుల్ కుమార్‌రెడ్డి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, ఆర్డీవోలు, తదితర అధికారులు పాల్గొన్నారు.