Share News

రయ్‌..రయ్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:07 AM

మహిళల ఆర్థిక బలోపేతానికి.. వారి స్వయం ఉపాధి కల్పనకు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.

రయ్‌..రయ్‌

మెప్మా ఆధ్వర్యంలో సబ్సిడీపై 150 మందికి బ్యాంకు రుణాలు

ర్యాపిడో సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ.. ఆపై బైక్‌ల అందజేత

ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చేలా మహిళల స్వయం ఉపాధి పథకం

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక బలోపేతానికి.. వారి స్వయం ఉపాధి కల్పనకు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మార్చి 8న సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రకా శం జిల్లా మార్కాపురంలో ప్రారంభించి మహిళలకు ర్యాపిడో మోటార్‌ సైకిల్స్‌ను అందించారు. తర్వాత విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, విజయవాడల్లో అమలు చేసి మంచి ఫలితాలు సాధించారు. దీంతో అన్నిపట్టణాల్లో మహిళా ర్యాపిడో మోటార్‌ సైకిల్స్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణ యించింది. ఈ మేరకు పట్టణ జీవనోపా ధిలో భాగంగా మెప్మా ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా సంఘాల్లోని ఆసక్తి కలిగిన సభ్యులను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి సబ్సిడీపై బ్యాంకు రుణం కల్పించి వాహనాన్ని అందిస్తారు. జిల్లాలో ని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు పట్టణా లను ఎంపికచేశారు. ఒక్కో పట్టణంలో 25 చొప్పున 150 మందిని ఎంపిక చేసి బైక్‌లు ఇస్తారు. ఎంపికైన మహిళలకు ర్యాపిడో సంస్థ కొద్ది కాలం శిక్షణ ఇస్తుంది. సబ్సిడీ పై వాహనాన్ని సమకూర్చిన తర్వాత ఆయా పట్టణాల్లోని ప్రయాణికులను మ హిళలు వారి గమ్యస్థానాలకు చేరుస్తారు.

Updated Date - Apr 15 , 2025 | 01:07 AM