YS Sharmila: అధికారులకు అవినాశ్ బెదిరింపులు
ABN, Publish Date - Apr 04 , 2025 | 03:49 AM
వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. అవినాశ్ రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్ల సాక్ష్యాలు నష్టపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు

తప్పుడు రిపోర్టుపై బలవంతంగా సంతకాలు
వివేకా కేసులో సాక్ష్యాల తారుమారు
బెయిల్‌పై ఉండటంవల్లే ఇదంతా చేస్తున్నారు
ఆయన బయట ఉండగా న్యాయం జరగదు
సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు
సునీతను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు
అమరావతి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని పసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ‘‘ మా బాబాయ్ హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతారెడ్డికి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో గురువారం షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘‘న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు అండగా నిలబడతా. ఈ కేసు ఆమె ఎంతో పెద్దవాళ్లను ఎదుర్కొంటోంది. అందుకే నేను అమె పక్కనే నిలబడ్డా. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సునీతారెడ్డికి న్యాయం జరుగుతుందా? ఆమె ప్రాణాలకు భద్రత ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అవినాశ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ప్రభుత్వ అఫిడవిట్‌లో పలు అంశాలు ఉన్నాయి. దర్యాప్తు అధికారులను అవినాశ్‌రెడ్డి తన ఇంటికి పిలిపించి బెదిరించారని ఆ అఫిడవిట్‌లో ఉంది. వివేకానందరెడ్డిని సునీత, ఆమె భర్త కలసి హత్య చేసినట్లుగా తప్పుడు రిపోర్టు తయారుచేసి దానిపై అధికారులతో సంతకాలు అవినాశ్ సంతకాలు చేయించినట్టు అందులో ఉంది. అవినాశ్‌రెడ్డి బెయిల్ మీద బయట ఉండటం వల్లే సాక్ష్యాలను తారుమారు చేయగలుగుతున్నారు’’ అని షర్మిల తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో వైసీపీ రాజకీయం చేస్తోందని ఆమె విమర్శించారు. ‘‘ఇదంతా బీజేపీ కుట్ర. గతంలోనూ బీజేపీ కోసం ఆ పార్టీ దత్తపుత్రుడు జగన్మోహన్‌రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు.
ప్రవీణ్ పగడాల హత్యకు గురైనట్లుగా ఆధారాలంటే రాజకీయాలకు అతీతంగా క్రిస్టియన్ సమాజంలోని వారెవరైనా సాక్ష్యాధారాలతో నన్ను కలవొచ్చు. డీజీపీకి వాటిని అందజేసి న్యాయ విచారణకు కోరతాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు, మీడియా వాస్తవాలు బయటపెడుతున్నాయనీ,. ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా పోలీసుల దర్యాప్తుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పార్లమెంటులో వక్ఫ్ బిల్లుకు సవరణలు తెచ్చి బీజేపీ మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. ఇది ముస్లిం మతం మీదనే కాదు, దేశ ఐక్యత మీద, రాజ్యాంగం మీద దాడి అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 04 , 2025 | 03:51 AM