Vastu Tips For Home: ఇంట్లో ఈ కలర్ వస్తువులు ఎక్కువగా ఉంటే గ్రహ దోషాలు తప్పవు..
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:05 AM
ఈ రంగు ఇంటీరియర్లు, వస్తువులను ఉంచుకోవడం ఈ రోజుల్లో చాలా ట్రెండీగా మారింది. కానీ, అది మీ ఇంటి శక్తి, వాతావరణంపై చూపే ప్రభావం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో ఈ కలర్ వస్తువులు ఉంటే..

Vastu Tips For Home: వాస్తు శాస్త్రంలో రంగులు మన జీవితాలపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని భావిస్తారు. ప్రతి రంగు మన జీవిత దిశను ప్రభావితం చేసే శక్తిని సూచిస్తుంది. ఈ రోజుల్లో నలుపు రంగు ఇంటీరియర్స్, ఇంట్లో నల్లటి వస్తువులను ఉంచుకోవడం చాలా ట్రెండీగా మారింది. కానీ, అది మీ ఇంటి వాతావరణంపై చూపే ప్రభావం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఇంట్లో నల్లటి బట్టలు, ఫర్నిచర్ లేదా ఇతర అలంకరణ వస్తువులు ఎక్కువగా ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నలుపు రంగు అలంకరణ వస్తువులు ఇంటికి క్లాసీ లుక్ ఇస్తాయి. మరకలు తక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఫర్నిచర్, గోడ అలంకరణలో నలుపు రంగును ఉపయోగించడం వల్ల అది చాలా కాలం పాటు శుభ్రంగా కనిపిస్తుంది. నలుపు రంగు ప్రభావం స్థిరత్వంను సూచిస్తుంది. అయితే, నల్లని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతికూల శక్తి ప్రభావం
వాస్తు శాస్త్రం ప్రకారం, నలుపు రంగును అధికంగా ఉపయోగిస్తే ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. నల్లని వస్తువులు ఎక్కువగా ఉంటే ఇంటిని నిస్తేజంగా, చీకటిగా కనిపించేలా చేస్తాయి, ఇది సానుకూలతను ప్రభావితం చేస్తుంది. మీ ఇంట్లో నల్లటి ఉపరితలాలు ఎక్కువగా ఉంటే అవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీని వలన ఉష్ణోగ్రత పెరుగుతుంది. గదిలో నల్ల రంగు వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే, దీనివల్ల గ్రహ దోషాలు కూడా పెరుగుతాయి.
ఏం చేయాలి?
నలుపును ప్రకాశవంతమైన రంగులతో (తెలుపు, క్రీమ్, బూడిద రంగు లేదా పాస్టెల్ షేడ్స్ వంటివి) సమతుల్యం చేయండి. సరైన ప్రదేశాలలో నలుపు రంగును ఉపయోగించండి. గోడలు, పెద్ద ఫర్నిచర్‌పై కాకుండా, చిన్న వస్తువులు, ఉపకరణాలలో నలుపు రంగును ఉపయోగించండి. ఇంట్లో నల్లని వస్తువులు ఎక్కువగా ఉంటే సహజ కాంతిని జాగ్రత్తగా చూసుకోండి. వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోండి.
Also Read:
Snake Bite: పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Health Tips: నిమ్మరసం మీ కళ్ళలోకి పడితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా..
Name Numerology: ఈ పేరు అక్షరం ఉన్న వ్యక్తులు మారాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే..