Lucky Day: మే నెలలో ఈ రాశివారికి జాక్‌పాట్.. కెరీర్‌లో విజయం సాధించడానికి ఇదే మంచి రోజు..
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:22 PM
Lucky Zodiac Signs May 2025: మరికొన్ని రోజుల్లో రానున్న మే నెల ఈ రాశులవారి దురదృష్టాన్ని దూరం చేయబోతోంది. వీరికి మంచి రోజులు రాబోతున్నాయ్. అనుకున్న ఏ పనైనా నిరాటంకంగా పూర్తయ్యి జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతోందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో ఏర్పడే మార్పులు ఈ రాశులవారికి శుభం చేకూర్చబోతున్నాయ్. అందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

Lucky Zodiac Signs May 2025: జ్యోతిషశాస్త్రం గురించి చాలా మంది ఈ ముఖ్యమైన విషయంపై పెద్దగా అవగాహన ఉండదు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో 12 ఇళ్ళు, 9 గ్రహాలు ఉంటాయి. గ్రహాల కదలికల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి జన్మ నక్షత్రం, పుట్టిన తేదీల ఆధారంగా ప్రజలకు జ్యోతిష్కులు ఏ గ్రహాలు శుభమైనవి, ఏ గ్రహాలు అశుభమైనవి చెబుతుంటారు. మన జీవితాలపై గ్రహాల ప్రభావం చాలా ఉంటుంది. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025లో మే నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో మూడు ప్రధాన గ్రహాలు బృహస్పతి, బుధుడు, శుక్రుడు తమ రాశులను మార్చుకుంటారు. ఈ ప్రభావవంతమైన గ్రహాలు తమ రాశులను కలిసి దిశ మార్చుకున్నప్పుడు.. ఆ ప్రభావం అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాలపై పడుతుంది.
మే నెలలో బృహస్పతి లేదా గురుడు తన స్థానం మార్చుకుని మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా బుధుడు, శుక్ర గ్రహాలు మేషరాశిలో సంచారము చేస్తాయి. ఈ గ్రహాల మార్పుల ప్రభావం ప్రతి వ్యక్తి రాశిచక్రం రాశిచక్రంపైనా పడి వారి రంగాలలో అనూహ్య మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ సమయం కొన్ని రాశులకు వెలకట్టలేనంత అదృష్టాన్ని మోసుకురాబోతోంది. గ్రహాల కదలికల కారణంగా వీరు కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. అసంపూర్ణంగా మిగిలిపోయిన పాత పనులను నిర్విఘ్నంగా పూర్తిచేసి జీవితంలో కొత్త ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి మే 2025 నెల ఈ మూడు రాశుల వారి జీవితాల్లో ఎలాంచి మార్పులను తెస్తుందో చూద్దాం.
వృషభ రాశి: మే నెలలో మూడు ప్రధాన గ్రహాల గమనంలో మార్పులు వృషభ రాశి వారికి లక్కీగా మారనున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుని లాభాలు ఆర్జించడానికి వీరికి పూర్తి సామర్థ్యం వస్తుంది. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఈ సమయంలో వృత్తివ్యాపారాల్లో లాభాలు, పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలను పొందే అవకాశం ఉంది. మీ మనసులో ఏవైనా ప్రణాళికలు ఉంటే.. ఆ ప్రణాళికలను అమలు చేయడానికి ఇదే మంచి సమయం.
మిథున రాశి: బృహస్పతి, బుధుడు, శుక్రుల సంచార స్థితిలో వేగంగా మార్పులు రావడం వల్ల మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకూలిస్తుంది. జీవితంలో ఎదిగేందుకు మంచి అవకాశాలను పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి వారి సీనియర్ల నుంచి పూర్తి మద్దతు దక్కుతుంది. వ్యాపారం చేసేవారికి ఎక్కువ లాభాలు సంపాదించడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో కెరీర్ పరంగా అత్యున్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంది. అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మిథున రాశి యువత ఈ సమయంలో పట్టు విడువడకుండా ప్రయత్నిస్తే విజేతలుగా నిలుస్తారు.
మకరం: గ్రహ సంచారంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా మకర రాశి వారికి ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్టులు లభించవచ్చు. అప్పుల బాధలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగేందుకు దారి దొరుకుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. అదనపు ఖర్చులు నియంత్రణలో ఉంచుకుని పొదుపు పాటిస్తే భవిష్యత్తులో రాబోయే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలరు.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం జ్యోతిష శాస్త్ర జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దీనికి హామీ ఇవ్వదు.)
Read Also: Baba Vanga: బాబా వంగా చెప్పినట్టే జరిగింది.. 2025లో నిజమైన ఆ సంఘటన..
Best Zodiac Signs: ఈ ఐదు రాశుల వారికి ఇక ఎదురే లేదు
Horoscope : ఈ రాశుల వారితో మీ ప్రేమ బంధం ఎంతో బాగుంటుంది..ఇందులో మీ రాశి చక్రం ఉందా..