Share News

Baba Vanga: బాబా వంగా చెప్పినట్టే జరిగింది.. 2025లో నిజమైన ఆ సంఘటన..

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:18 PM

Baba Vanga predictions 2025: బాబావంగా బల్గేరియా దేశానికి చెందిన ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు. అంధురాలైనప్పటికీ ఈమె భవిష్యత్తులో జరగబోయే ఎన్నో సంఘటనలను ఊహించగలిగారు. కాలజ్ఞానిగా పేరొందిన ఈమె 2025 జరుగుతుందని చెప్పిన ఈ సంఘటన నిజం కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Baba Vanga: బాబా వంగా చెప్పినట్టే జరిగింది.. 2025లో నిజమైన ఆ సంఘటన..
What Baba Vanga predicted for 2025

What Baba Vanga predicted for 2025: బాబా వంగా అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. 1911 బల్గేరియాలో పుట్టిన ఈమె వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు. 12 ఏళ్ల వయసులో భారీ తుపాను కారణంగా కంటిచూపు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత నుంచే బాబా వంగాకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని అంటుంటారు. 1996లో మరణానికి ముందు బాబా వంగా బ్రిటన్ యువరాణి డయానా మరణం, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబయి ఉగ్రవాద దాడుల, చైనా ఎదుగుదల, రష్యా-ఉక్రెయిన్ వివాదం ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పిన జోస్యం ఫలిచింది.'నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్'గా పేరుగాంచిన బాబా వంగా 2025లో ఈ ఘటననూ ముందుగానే అంచనా వేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ బాబా వంగా ప్రవచనాలు వార్తల్లోకెక్కాయి.


1996లో మరణించిన బాబావంగా స్మార్ట్ ఫోన్ వ్యసనం, ప్రపంచంలో పెను యుద్ధాలు, భారీ భూకంపాల గురించి ముందుగానే జోస్యం చెప్పారు. ప్రపంచంలో పెద్ద ప్రకృతి విపత్తులు వస్తాయని, భూమి కంపించి వేలమంది ప్రాణాలు కోల్పోతారని అంచనా వేశారు. ఇటీవల మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించి 1700లకు పైగా మృతి చెందడంతో బాబా వంగా చెప్పినట్టే జరిగిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ది న్యూయార్క్ ప్రచురించింది. యూరప్‌లో యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విపత్తు గురించి కూడా ప్రస్తావించడంతో ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా జోస్యంపై చర్చ మొదలైంది.


బాబా వంగా ప్రకారం మానవాళి పతనం కాలక్రమంలో ఎలా జరుగుతుందో ఇక్కడ ఉంది:

  • 2025: యూరప్‌లో ఏర్పడే ఒక పెద్ద వివాదం మొత్తం ఖండంలోని జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

  • 2028: మానవులు ప్రత్యమ్నాయ శక్తి వనరు కోసం శుక్రుడిపై (వీనస్) అన్వేషించడం ప్రారంభిస్తారు.

  • 2033: ధ్రువప్రాంతాల్లోని మంచు గడ్డలు కరిగి ప్రపంచ సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి.

  • 2130: మానవులు గ్రహాంతర జీవులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు.


  • 2170: దాదాపు భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల్లోకి కరవు విస్తరించి తీవ్ర ఇబ్బందులు పడతారు.

  • 3005: భూమిపై ఉన్న ప్రజలు మార్స్ గ్రహంపై నివసించే ( అంగారక గ్రహం) ప్రజలతో యుద్ధం చేస్తారు.

  • 3797: భూమి నివాసయోగ్యంగా పనికిరాక మానవులు దానిని వదిలి వెళ్ళవలసి వస్తుంది.

  • 5079: ప్రపంచం అంతం అవుతుంది.

బాబా వంగా 2025లో భూకంపాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పారే తప్ప మయన్మార్ పేరు ప్రత్యేకించి ప్రస్తావించలేదు. కానీ ప్రపంచం కచ్చితంగా 5079లో ముగుస్తుందని ఆమె చెప్పారు.


Read Also: Horoscope : ఈ రాశుల వారితో మీ ప్రేమ బంధం ఎంతో బాగుంటుంది..ఇందులో మీ రాశి చక్రం ఉందా..

2025 HorosCope : బాబా వంగా ప్రకారం.. అదృష్టమంటే ఈ రాశివారిదే.. ఈ సంవత్సరం చాలా డబ్బు సంపాదిస్తారు..

Ring benefits: ఈ వేలికి ఉంగరం ధరిస్తే హ్యాపీ లైఫ్ మీ సొంతం..

Updated Date - Apr 02 , 2025 | 06:29 PM