Share News

అమర రాజాతో అతుల్‌ గ్రీన్‌టెక్‌ జట్టు

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:38 AM

విద్యుత్‌ వాహనాల (ఈవీ)కు అవసరమైన బ్యాటరీలు, చార్జర్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు అమర రాజా గ్రూప్‌ సిద్ధమవుతోంది. ఇందుకోసం అతుల్‌ ఆటో అనుబంధ కంపెనీ...

అమర రాజాతో అతుల్‌ గ్రీన్‌టెక్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విద్యుత్‌ వాహనాల (ఈవీ)కు అవసరమైన బ్యాటరీలు, చార్జర్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు అమర రాజా గ్రూప్‌ సిద్ధమవుతోంది. ఇందుకోసం అతుల్‌ ఆటో అనుబంధ కంపెనీ అతుల్‌ గ్రీన్‌టెక్‌తో అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ (ఏఆర్‌ఈఎం) అనుబంధ సంస్థ అయిన అమర రాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ (ఏఆర్‌ఏసీటీ), అమర రాజా పవర్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (ఏఆర్‌పీఎ్‌సఎల్‌) మధ్య ఒక త్రైపాక్షిక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అతుల్‌ గ్రీన్‌టెక్‌ త్రిచక్ర ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైన లిథియం ఐరన్‌ ఫాస్పేట్‌ (ఎల్‌ఈపీ) బ్యాటరీలు, చార్జర్లను అమర రాజా గ్రూప్‌ కంపెనీలు అభివృద్ధి చేసి సరఫరా చేస్తాయి. ఈ ఒప్పందం అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్స్‌ అభివృద్ధికి కూడా వీలు కల్పిస్తుందని మూడు కంపెనీలు ప్రకటించాయి. ఈ బ్యాటరీలను అమర రాజా.. తెలంగాణలోని దివిటిపల్లి వద్ద ఉన్న తన గిగా కారిడార్‌లో తయారు చేస్తుంది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:38 AM