Share News

Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:58 PM

ప్రస్తుత కాలంలో ఇప్పటికే ఇంటర్ నెట్ వినియోగం పెరగడంతోపాటు ఏఐ వాడకం కూడా పుంజుకుంది. ఈ క్రమంలో అనేక కంపెనీలు ఇప్పటికే ఏఐ కారణంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏఐ గురించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Bill Gates and Nikhil Kamath Discuss

రాబోయే రెండు దశాబ్దాల్లో కృత్రిమ మేధస్సు (AI) మన జీవితాలను, ముఖ్యంగా ఉద్యోగ ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) అన్నారు. ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ హోస్ట్ చేసిన ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న క్రమంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. ఏఐ కేవలం వైట్ కాలర్ ఉద్యోగాలకే పరిమితం కాదని. బ్లూ కాలర్ పనుల్ని కూడా చేయగలవన్నారు. రోబోలు భౌతిక పనుల్లో మానవుల మాదిరిగా పనిచేయగల సామర్థ్యంతో వస్తున్నట్లు చెప్పారు.


ఈ ఉద్యోగాల విషయంలో..

ఈ క్రమంలో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడి నుంచి డాక్టర్ల వరకు అనేక రకాల ఉద్యోగాల్లో AI భాగస్వామిగా మారుతుందన్నారు. ఇది ఉద్యోగాలను పూర్తిగా తీసేసే విషయంలో కాదు. కానీ మనకు సహాయపడుతూ సమర్థవంతంగా పనులు జరిగేలా చేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో ఉద్యోగుల కొరత ఉంది. డాక్టర్లు, టీచర్లు, ఫ్యాక్టరీ కార్మికులు ఇలా అనేకమంది అవసరం. అయితే ఈ కొరతను AI భర్తీ చేస్తూ పని నాణ్యతను పెంచే అవకాశముందన్నారు. చిన్న స్థాయి ఉద్యోగాల విషయంలో ఏఐ భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఈ మార్పు సమాజాన్ని సమతుల్యంగా మార్చగలదని, ఆ క్రమంలో మనకు ఎక్కువ సమయం మిగులుతుందన్నారు.


చిన్న పని వారాల తగ్గింపు..

ఈ మార్పుల వల్ల మనం భవిష్యత్తులో వారం మొత్తానికి మూడే రోజులూ పని చేయొచ్చని లేదా 50 సంవత్సరాలకే రిటైర్ అయిపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు బిల్ గేట్స్. మీరు తక్కువ గంటలు పని చేస్తారు. కానీ మిగతా సమయాన్ని ఎలా వినియోగించుకోవాలన్నదే అసలైన ప్రశ్న అని పేర్కొన్నారు. ఇప్పటివరకు మనం పని కోసం జీవించాం. కానీ రాబోయే రోజుల్లో జీవించడమే అసలైన పని అవుతుందన్నారు. సృజనాత్మకతకు సమయం కేటాయించాలా, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలా లేదా కుటుంబం, మిత్రులతో ఎక్కువ సమయం గడపాలా అన్నది మీపై ఆధారపడి ఉంటుందన్నారు.


భవిష్యత్తు ఉద్యోగాలు ఎలా ఉంటాయ్?

ఏఐ సాధారణ పనులను చేస్తూ మానవులను అవసరమైన పనుల వైపు మళ్ళించనుందన్నారు బిల్ గేట్స్. ఉదాహరణకు AI ఆధారిత రోగ నిర్ధారణ వ్యవస్థలు, వ్యక్తికరించిన అభ్యాస పద్ధతులు, ఆటోమేషన్ ద్వారా వేగవంతమైన ఉత్పత్తి, డేటా విశ్లేషణ ఆధారిత పెట్టుబడి సలహాలు సహా పలు ఉద్యోగాలను పూర్తిగా తీసేయకపోయినా, ప్రభావం మాత్రం ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. డేటా అనలిటిక్స్, కోడింగ్, డిజైన్, మానవ సంబంధ నైపుణ్యాలను నేర్చుకుంటే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు.


ఇవి కూడా చదవండి:

Ayodhya: రాములోరి ఆలయానికి బెదిరింపు.. భారీగా భద్రత పెంచిన ప్రభుత్వం


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..


Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 15 , 2025 | 05:59 PM