లిథియం ఉత్పత్తిలోకి కోల్ ఇండియా
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:00 AM
బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ప్రభుత్వ రంగంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) కీలకమైన లిథియం ఖనిజ ఉత్పత్తిలోకి ప్రవేశించాలని...

న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ప్రభుత్వ రంగంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) కీలకమైన లిథియం ఖనిజ ఉత్పత్తిలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. కంపెనీ సీఎండీ పీఎం ప్రసాద్ ఈ విషయం వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే అర్జెంటీనా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ ఖనిజ నిక్షేపాలున్న కొన్ని బ్లాకులను పరిశీలిస్తుట్టు చెప్పారు. అరుదైన లిథియం ఖనిజాన్ని విద్యుత్ వాహనాల బ్యాటరీలు, పవన విద్యుత్ టర్బైన్స్‌లో పెద్ద ఎత్తున వినియోగిస్తారు. మన దేశంలో ఈ ఖనిజ నిక్షేపాలు పెద్దగా లేవు. దీంతో మన దేశానికి చెందిన అనేక కంపెనీలు ఈ నిక్షేపాలు అధికంగా ఉన్న అర్జెంటీనా, చిలీ, ఆస్ట్రేలియావైపు చూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News