How to Check PAN Card Status in Telugu : పాన్ కార్డు దరఖాస్తు చేయడం.. స్టేటస్ చెకింగ్ వచ్చా.. చాలా సింపుల్..
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:35 PM
ఆధార్ కార్డు తర్వాత అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు పాన్ కార్డు. దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు ఉండే ఉంటుంది. మరి మీ పాన్ కార్డు స్టేటస్ ఏంటని ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా.. ఇది ఎందుకంత ముఖ్యమో తెలుసా.. ఆ విషయం తెలుసుకునేందుకు మీరు ఎక్కడెక్కడికో వెళ్లనవసరం లేదు. ఇప్పుడు మీ మొబైల్‌లోనే చాలా సులభంగా పాన్ కార్డు స్టేటస్ చెకింగ్‌తో పాటు దరఖాస్తు కూడా చేయవచ్చు..

ఆధార్ కార్డు తర్వాత అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు పాన్ కార్డు. బ్యాంకింగ్ సర్వీసెస్ పొందాలన్నా, ఏ ఆర్థిక లావాదేవీ చేయాలన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల కోసం పాన్ కార్డు (PAN -Permanent Account Number) తప్పనిసరి. దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు ఉండే ఉంటుంది. ఎందుకంటే బ్యాంకు ఖాతా కావాలంటే పాన్ కార్డు సమర్పించాల్సిందే. మరి మీ పాన్ కార్డు స్టేటస్ ఏంటని ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా.. ఇది ఎందుకంత ముఖ్యమో తెలుసా.. ఆ విషయం తెలుసుకునేందుకు మీరు ఎక్కడెక్కడికో వెళ్లనవసరం లేదు. ఇప్పుడు మీ మొబైల్‌లోనే చాలా సులభంగా పాన్ కార్డు స్టేటస్ చెకింగ్ చేయవచ్చు. ఇదే కాదు. కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేవారు, ఇది వరకే అప్లై చేసి వేచిచూస్తున్నవారు, పాన్ కార్డు వివరాలు మార్చుకునేవారు ఇలా సింపుల్‌గా ఫోన్ ద్వారానే పూర్తిచేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
పాన్ కార్డు (PAN -Permanent Account Number) లేకపోతే బ్యాంక్ ఖాతా తెరవలేము. ఇది లేకపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందవు. ఐడెంటిటీ ప్రూఫ్, టాక్స్ ఫైలింగ్, పెట్టుబడులు, బీమా, బ్యాంకింగ్, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేయాలంటే ఇప్పుడు ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు చాలా విలువైనది. దేశంలోని ప్రతి ఒక్కరి ఆదాయ వ్యవహరాలు పాన్ కార్డు ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. పాన్ నెంబర్ (ఆల్ఫా-న్యూమరికల్ కోడ్)ను డూప్లికేట్ చేయడం అసాధ్యం. కాబట్టి పాన్ కార్డు లేని వారు కచ్చితంగా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆధార్ పాన్ కార్డులు లింక్‌ను తప్పనిసరి చేసింది.
మొబైల్‌లో పాన్ కార్డు స్టేటస్ ఇలా చెక్ చేయండి..
1. SMS ఉపయోగించి..
ముందుగా మీరు దరఖాస్తులో ఇచ్చిన ఫోన్ నెంబర్‌లో SMS యాప్‌ను తెరవండి.
SMS యాప్ నుంచి 57575కు "NSDLPAN <15-అంకెల రసీదు సంఖ్య>" అని టైప్ చేయండి.
కొన్ని సెకన్ల వ్యవధిలోనే పాన్ కార్డు స్టేటస్ గురించి అన్ని వివరాలతో కూడిన SMS వస్తుంది.
2. మొబైల్ యాప్ (NSDL)/(UTIITSL) ని ఉపయోగించి..
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి NSDL/UTIITSL యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి
యాప్‌ను తెరిచి "PAN"పై క్లిక్ చేశాక "Track PAN Status"ని ఎంచుకోండి.
అప్లికేషన్‌లో మీ దరఖాస్తు సంఖ్య, పేరు, పుట్టిన తేదీని పూరించండి.
తర్వాత "Submit" బటన్‌ను నొక్కండి.
మీ PAN కార్డ్ స్టేటస్ కనిపిస్తుంది.
3. NSDL పోర్టల్ ద్వారా కూడా పాన్ కార్డు స్టేటస్ తనిఖీ ..
ముందుగా NSDL ట్రాకింగ్ పోర్టల్‌కు వెళ్లండి.
'PAN Card Status' పై క్లిక్ చేసి పాన్ నెంబరు, క్యాప్చా కోడ్ టైప్ చేయండి.
సబ్మిట్ బటన్ నొక్కగానే మీ పాన్ కార్డు స్టేటన్ వివరాలు వస్తాయి.
మొబైల్‌లో పాన్ కార్డుకు ఇలా దరఖాస్తు చేసుకోండి..
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి NSDL PAN యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
న్యూ అకౌంట్ క్రియేట్ చేసి పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ వంటి వివరాలు ఇవ్వాలి.
వ్యక్తిగత వివరాలు ఇన్‌కమ్, అడ్రస్ వివరాలు ఇవ్వాలి.
తర్వాత గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లు స్కాన్ చేసి సాఫ్ట్ కాపీలు సమర్పించాలి
క్రెడిట్/డెబిట్/నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
చివరగా ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి. 6 వారాల వ్యవధిలో పాన్ కార్డు మీ ఇంటికి వచ్చేస్తుంది.
మొబైల్‌లో పాన్ కార్డు మోడిఫికేషన్ కోసం..
NSDL PAN యాప్‌లో అకౌంట్‌లోకి లాగిన్ అవండి.
"Modify PAN Details" ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
ఏ వివరాలు మార్పులు చేయాలనుకుంటున్నారో చేయండి. తర్వాత అప్ డేట్ చేయండి.
ఏ వివరాలు మారుస్తున్నారో అందుకు సంబంధించిన ధృవపత్రం స్కాన్ చేసి సమర్పించాలి.
క్రెడిట్/డెబిట్/నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలి.
చివరగా ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి.