PF Withdraw: ఈ యాప్ నుంచి నిమిషాల్లో మీ పీఎఫ్ విత్ డ్రా.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..
ABN, Publish Date - Jan 06 , 2025 | 03:31 PM
ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి రోజూ కొత్త సాంకేతికతలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఉమంగ్ యాప్ సేవలను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఈజీగా మీ పీఎఫ్ విత్ డ్రాతోపాటు 100కుపైగా సేవలను వినియోగించుకోవచ్చు.
మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఉపసంహరణను ఇప్పుడు మరింత సులభంగా చేసుకోవచ్చు. ఎలాగంటే UMANG యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. గతంలో PF ఉపసంహరణ కోసం నేరుగా EPFO కార్యాలయాన్ని సందర్శించడం లేదా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసేవారు. కానీ UMANG యాప్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి డిజిటల్‌గా వేగంగా చేసుకోవచ్చు. ఇది EPFO ఖాతాదారులకు అనేక సౌకర్యాలను అందిస్తోంది.
UMANG యాప్ అంటే ఏంటి?
ఉమంగ్ (Unified Mobile Application for New age Governance) యాప్ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY), నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ యాప్ 200 కంటే ఎక్కువ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 1,200 కంటే ఎక్కువ సేవలను అందిస్తోంది. దీనిలో EPFO (Employee Provident Fund Organization) సేవలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా మీరు PF బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. PFని బదిలీ చేయడం, విత్ డ్రాను కూడా చేయవచ్చు.
PF ఉపసంహరణకు ముందు ఏం చేయాలి
UAN, ఆధార్ లింకింగ్: EPFO ఖాతాదారులు, PF ఉపసంహరణను ప్రారంభించడానికి ముందు తమ Universal Account Number (UAN) ను ఆధార్‌తో లింక్ చేయాలి.
KYC పూర్తి చేయడం: మీరు PF ఖాతాలో ఉన్న ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేసి ధృవీకరించుకోవాలి
ఉపసంహరణకు కారణం: నిరుద్యోగం, పదవీ విరమణ, మెడికల్ ఎమర్జెన్సీ, విద్య లేదా ఇల్లు కొనుగోలు వంటి కారణాల వల్ల మాత్రమే PFను విత్‌డ్రా చేసుకోవచ్చు
PF ఉపసంహరణ UMANG యాప్ ద్వారా ఎలా చేయాలంటే..
Google Play Store లేదా Apple App Store నుంచి "UMANG యాప్" డౌన్‌లోడ్ చేసుకోండి
మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వండి, OTP ద్వారా నంబర్ ధృవీకరించండి.
యాప్ హోమ్‌పేజీలో EPFO విభాగానికి వెళ్లి "ఎంప్లాయీ-సెంట్రిక్ సర్వీసెస్" పై క్లిక్ చేయండి
"రైజ్ క్లెయిమ్" ఆప్షన్‌పై క్లిక్ చేసి, UAN, ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను ధృవీకరించండి
అవసరమైన సమాచారం పూరించి, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి (ఉదాహరణకు, మెడికల్ సర్టిఫికేట్)
అన్ని వివరాలు పూరించి, దరఖాస్తును సమర్పించండి
ట్రాక్ క్లెయిమ్" విభాగంలో క్లెయిమ్ స్థితిని ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు
UMANG యాప్ ముఖ్య లక్షణాలు
పేపర్ లేకుండా ప్రక్రియ: దాదాపు అన్ని పత్రాలు డిజిటల్‌గా సమర్పించవచ్చు. కాబట్టి భౌతిక డాక్యుమెంటేషన్ అవసరం లేదు
24x7 సేవలు: ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ సేవలను పొందవచ్చు
వేగవంతమైన పరిష్కారం: డిజిటల్ ప్రక్రియ ద్వారా, ఈ క్లెయిమ్ ఆమోదం, నిధుల బదిలీ వేగంగా జరుగుతుంది
ఇవి కూడా చదవండి:
Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..
Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Piyush Goyal: ఈవీలకు సబ్సిడీలు అవసరం లేదు.. వారే స్వయంగా చెప్పారు
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 06 , 2025 | 03:34 PM