Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
ABN , Publish Date - Mar 23 , 2025 | 06:13 PM
ఐటీ రంగంలో మళ్లీ ఉద్యోగాల కోతలు తప్పవని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ సంస్థ ఐబిఎం ఈ ఏడాది దాదాపు 9 వేల మందిని తొలగిస్తుందని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ప్రపంచం రోజుకు రోజుకు మారిపోతున్న నేపథ్యంలో ఉద్యోగ విభాగాల్లో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ప్రముఖ అగ్ర సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ ఐబిఎం కూడా ఈ ఏడాది అమెరికాలో దాదాపు 9,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇక మిగిలేది ఎవరని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
వీలైనంత ఎక్కువ మందిని
ది రిజిస్టర్ నివేదిక ప్రకారం, ఈ తొలగింపులు ఐబిఎం క్లౌడ్ క్లాసిక్ యూనిట్ వంటి అనేక విభాగాలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. ఇందులో దాదాపు 50% మంది ఉద్యోగులు ఈ మార్పులకు గురవుతున్నారని భావిస్తున్నారు. అయితే, పశ్చిమ దేశాలలో ఉద్యోగ నష్టాలు పెరుగుతున్నప్పటికీ, ఈ పునర్నిర్మాణం భారతదేశానికి అనుకూలంగా మారవచ్చని నిపుణులు అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఐబిఎం తన ఉద్యోగులను ఇండియాకు మార్చుతుందని అంటున్నారు. ఈ క్రమంలో వీలైనంత ఎక్కువ మందిని భారతదేశానికి తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ఖర్చులు తక్కువగా
ఐబిఎం ప్రస్తుతం యుఎస్ కంటే భారతదేశంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కలిగి ఉందని, ఉద్యోగం కోల్పోయిన ఒక యుఎస్ ఉద్యోగి కూడా పేర్కొన్నాడు. భారతదేశంలో ప్రతిభ సమృద్ధిగా ఉండటంతో పాటు, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల ఐబిఎం తన శ్రామిక శక్తిని భారతదేశం వైపు తిరిగి కేంద్రీకరించాలనే వ్యూహాన్ని అవలంబిస్తోందన్నారు. ఐబిఎం CEO అరవింద్ కృష్ణ కూడా ఈ విషయాన్ని గతంలో బహిరంగంగా చర్చించారు.
అవకాశాలను పెంచే దిశగా
ఈ క్రమంలో ఊహించిన విధంగా జరిగితే, భారతీయ టెక్ ఉద్యోగులు ముఖ్యంగా క్లౌడ్, మౌలిక సదుపాయాలు, సేల్స్, కన్సల్టింగ్ అనుభవం ఉన్నవారు మరిన్ని ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ప్రధానంగా పశ్చిమ దేశాలలో తొలగించబడుతున్న వారు భారతదేశంలో అవకాశాలను పొందవచ్చు. ఐబిఎం ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై వంటి నగరాల్లో విస్తరించింది. ఇది భారతదేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా కృషి చేస్తోందని నిపుణులు అంటున్నారు.
భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు
ఈ మార్పులు భారతదేశంలో IT రంగానికి కొత్త అవకాశాలను తెచ్చే అవకాశం ఉంది. ఐబిఎం వంటి సంస్థలు భారతదేశంలో ఉన్న ప్రతిభను గుర్తించి, నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారతీయ ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవడం, కొత్త సాంకేతికతలను నేర్చుకోవడం ద్వారా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ క్రమంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు మంచి అవకాశాలు రానున్నాయి.
ఇవి కూడా చదవండి:
Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News