Share News

టారిలీఫ్‌..!

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:46 AM

వరుసగా రెండో రోజూ భారీగా లాభపడిన భారత స్టాక్‌ మార్కెట్‌.. ట్రంప్‌ సుంకాల నష్టాల నుంచి పూర్తిగా కోలుకుంది. వాహన, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, రియల్టీ సహా అన్ని రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో...

టారిలీఫ్‌..!

ట్రంప్‌ సుంకాల నష్టాల నుంచి పూర్తిగా కోలుకున్న భారత మార్కెట్‌

సెన్సెక్స్‌ మరో 1,577 పాయింట్లు అప్‌

  • మళ్లీ 23,300 ఎగువకి నిఫ్టీ

  • ఒక్కరోజే రూ.10.57 లక్షల కోట్ల లాభం

  • 2 సెషన్లలో రూ.18.42 లక్షల కోట్ల వృద్ధి

ముంబై: వరుసగా రెండో రోజూ భారీగా లాభపడిన భారత స్టాక్‌ మార్కెట్‌.. ట్రంప్‌ సుంకాల నష్టాల నుంచి పూర్తిగా కోలుకుంది. వాహన, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, రియల్టీ సహా అన్ని రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో మంగళవారం సెన్సెక్స్‌ 1,577.63 పాయింట్ల (2.10 శాతం) లాభంతో 76,734.89 వద్దకు చేరింది. ఒకదశలో సూచీ 1,750.37 పాయింట్లు ఎగబాకి 76,907.63 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం 500 పాయింట్ల (2.19 శాతం) వృద్ధితో 23,328.55 వద్ద ముగిసింది. ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులను సుంకాల నుంచి మినహాయించిన ట్రంప్‌ సర్కారు.. వాహన రంగానికి టారి్‌ఫల నుంచి తాత్కాలిక ఊరట కల్పిస్తామని సంకేతాలిచ్చారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలూ ర్యాలీ తీశాయి. ఆర్‌బీఐ రెపో తగ్గింపుతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తుండటం దేశీయంగా వినియోగం పెరగడానికి దోహదపడనుందన్న ఆశాభావం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజే రూ.10.57 లక్షల కోట్లు పెరిగి రూ.412.24 లక్షల కోట్ల(4.81 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది. గడిచిన రెండు సెషన్లలో మదుపరుల సంపద రూ.18.42 లక్షల కోట్లు పెరిగింది.


  • సెన్సెక్స్‌ నమోదిత 30 కంపెనీల్లో హెచ్‌యూఎల్‌, ఐటీసీ మినహా అన్నీ రాణించాయి. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ షేరు 6.84 శాతం వృద్ధితో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టాటా మోటార్స్‌, ఎల్‌ అండ్‌ టీ స్టాక్‌ 4.50 శాతం చొప్పున పెరిగాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ కూడా 4 శాతానికి పైగా ఎగబాకాయి. మార్కెట్‌ దిగ్గజాలైన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 3.23 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.69 శాతం పెరిగాయి.

  • బీఎ్‌సఈలో 3,266 కంపెనీల షేర్లు లాభపడగా.. 833 నష్టపోయాయి. మరో 157 యథాతథంగా ముగిశాయి. 91 కంపెనీల స్టాక్స్‌ సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని తాకాయి.

  • ఫారెక్స్‌ ట్రేడింగ్‌ విషయానికొస్తే, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు పెరిగి రూ.85.80 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడటంతోపాటు ఈక్విటీ మార్కెట్లో లాభాలు మన కరెన్సీకి బలం చేకూర్చాయి.

  • ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర రూ.50 పెరుగుదలతో ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.96,450 వద్దకు తిరిగి చేరుకుంది. కిలో వెండి రూ.2,500 ఎగబాకి రూ.97,500 ధర పలికింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశలో 3,224 డాలర్లు, సిల్వర్‌ 32.32 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.


టారిఫ్‌ నష్టాలు భర్తీ

ఈ నెల 2న సెన్సెక్స్‌ 76,617.44 వద్ద, నిఫ్టీ 23,332.35 వద్ద ముగియగా.. బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.412.98 లక్షల కోట్లుగా నమోదైంది. ఆ రోజు అర్ధరాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ సహా ప్రపంచ దేశాలపై అదనపు సుంకాలను ప్రకటించారు. కొన్ని రోజులకే టారి్‌ఫల అమలును 90 రోజులు వాయిదా వేయడంతో పాటు ఆపై కొన్ని రంగాలకు మినహాయింపులు కల్పించారు. దాంతో గడిచిన రెండు వారాల్లో మార్కెట్‌ సూచీలు తొలుత భారీ పతనాలను, ఆపై భారీ లాభాలనూ చవిచూశాయి. మొత్తానికి సూచీలు సుంకాలతో తొలుత ఏర్పడిన నష్టాలను దాదాపుగా పూడ్చుకోగలిగాయి. ఈ నెల 2 నాటి ముగింపు స్థాయితో పోలిస్తే, మంగళవారం నాటి కి సెన్సెక్స్‌ 117.45 పాయింట్ల (0.15 శాతం) లాభంతో 76,734.89 వద్దకు చేరింది. నిఫ్టీ మాత్రం మరో 5 పాయింట్ల చేరువలో ఉంది. బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌ కూడా రూ.74,000 కోట్ల మేర పెరగాల్సి ఉంది.


ఏడాది చివరినాటికి సెన్సెక్స్‌ ః 82,000

ఈ ఏడాది డిసెంబరు చివరినాటికి సెన్సెక్స్‌ 82,000 స్థాయికి చేరుకోవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సేవల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. సూచీ ప్రస్తుత స్థాయితో పోలిస్తే, 9 శాతం అధికమిది. అయితే, ఇదే బ్రోకరేజీ సంస్థ సెన్సెక్స్‌ ఈ ఏడాది చివరినాటికి 93,000 స్థాయికి ఎగబాకవచ్చని అంచనా వేసింది. ట్రంప్‌ సుంకాలతో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సెన్సెక్స్‌ టార్గెట్‌ను 12 శాతం మేర తగ్గిస్తున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ అనలిస్టులు రిధమ్‌ దేశాయ్‌, నయంత్‌ పరేఖ్‌ తాజా నోట్‌లో పేర్కొన్నారు.

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:46 AM