Share News

Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:05 PM

భారత స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రధాన సూచీలు ఏ మేరకు పడిపోయాయి. టాప్ 5 స్టాక్స్ ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Stock market On feb 20th 2025

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) గురువారం (ఫిబ్రవరి 20) కూడా మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 203.22 పాయింట్లు తగ్గి 75,735 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 50 కూడా 19.75 పాయింట్లు తగ్గి 22,913.15 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 236 పాయింట్లు నష్టపోయి 49,334 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం వీటికి విరుద్ధంగా 637 పాయింట్లు లాభపడి 51,163 స్థాయికి చేరింది. ఈ క్రమంలో పలువురు మదుపర్లు నష్టపోగా, మరికొంత మంది మాత్రం లాభపడ్డారు.


టాప్ 5 స్టాక్స్

ఈ క్రమంలో HDFC బ్యాంక్, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా, టాటా కంన్జూమర్స్, HCL టెక్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, శ్రీరామ్ ఫైనాన్స్, NTPC, M&M, భారత్ ఎలక్ట్రిక్, అదానీ పోర్ట్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లోని 50 స్టాక్‌లలో 28 లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ PSB, మెటల్, రియాల్టీ, OMC, మీడియా సూచీలు ఒక శాతానికి పైగా లాభాలతో ముగియగా, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 0.75 శాతం వరకు నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ ధోరణుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు.


21 శాతం క్షీణించిన సూచీ

2025లో ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్ సూచీలు 3% కంటే ఎక్కువ పడిపోయాయి. సెప్టెంబర్ చివరి తర్వాత రికార్డు గరిష్టాల నుంచి దాదాపు 13 శాతం తగ్గాయి. ఈ క్రమంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వాటి గరిష్ట స్థాయిల నుంచి వరుసగా 17%, 21% క్షీణించాయి. కంపెనీ DET బిజినెస్ కోసం కొత్త CEOని నియమించిన తర్వాత సైయంట్ షేర్లు 4% పెరిగాయి. దీంతోపాటు గోల్డ్‌మన్ సాచ్స్ కూడా రూ. 401 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన తర్వాత BSE షేర్లు దాదాపు 2% పుంజుకున్నాయి.


ఇవి కూడా చదవండి:

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News


Updated Date - Feb 20 , 2025 | 04:39 PM