Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఐదో రోజూ పతనం.. మదుపర్లకు నష్టాలే నష్టాలు
ABN, Publish Date - Jan 09 , 2025 | 03:44 PM
నేడు (జనవరి 9న) దేశీయ స్టాక్ మార్కెట్లు ఐదో రోజూ వరుసగా పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీనత కారణంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో BSE సెన్సెక్స్ 528 పాయింట్లు తగ్గి 77,620 వద్ద ముగిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా ఐదో రోజూ పతనమయ్యాయి. ఈరోజు (జనవరి 9న) రోజున విస్తృత ఆధారిత విక్రయాల మధ్య స్టాక్ మార్కెట్ క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ల బలహీనత కూడా దేశీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచింది. దీంతో BSE సెన్సెక్స్ ఇండెక్స్ 528.28 పాయింట్లు తగ్గి 77,620.21 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 162.45 పాయింట్లు పడిపోయి 23,526.50 వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు కూడా వరుసగా 331, 525 పాయింట్లు నష్టపోయాయి. దీంతో మదుపర్లు కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
భారీగా పడిపోయిన ఈ స్టాక్స్
ఈరోజు, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు రెడ్‌లో కొనసాగాయి. ఈ క్రమంలో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో 50 షేర్లలో 33 షేర్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.92 శాతం పడిపోయాయి. సెక్టార్లలో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 2 శాతం క్షీణించగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1 శాతం వరకు తగ్గింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఐటీ సూచీలు 0.9 శాతం వరకు పతనమయ్యాయి.
మరోవైపు ఈ స్టాక్స్ కూడా..
BSEలో బాలాజీ అమీన్స్ +12%, ఆల్కైల్ అమీన్స్ +11%. మారికో +5, ఆర్తి ఇండస్ట్రీస్ +4% టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అదే సమయంలో ఏజిస్ లాజిస్టిక్స్ -6%, కళ్యాణ్ జ్యువెలర్స్ -6%, ఆయిల్ ఇండియా -5%, పీసీబీఎల్ -5% క్షీణించాయి. SRF లిమిటెడ్ +17%, నవీన్ ఫ్లోరిన్ +10%, IGL +6%, స్విగ్గీ +3% జంప్ చేశాయి. ఉదయం సెన్సెక్స్ 78,206 వద్ద ప్రారంభమైనప్పటికీ, ఆపై 77,880 స్థాయికి పడిపోయింది. ఇదే సమయంలో నిఫ్టీ 23,674 వద్ద ప్రారంభమై 23,607 స్థాయికి పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 49,712 స్థాయి వద్ద ప్రారంభమైంది. కానీ 49,486 స్థాయి వద్ద దిగజారింది.
మరోవైపు గోల్డ్ రేటు..
క్రూడాయిల్ ఒక శాతం తగ్గి 77 డాలర్ల దిగువకు చేరింది. బంగారం ధర $10 పెరిగి $2675కి చేరుకోగా, వెండి వరుసగా ఐదవ రోజు $31 వద్ద బలంగా ఉంది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ. 200 పెరిగి రూ.77,700 వద్ద, వెండి ధర రూ.100 పెరిగి రూ.91,000 వద్ద ముగిసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో రాగి మినహా అన్ని మూల లోహాలు బలహీనంగా ఉన్నాయి. LMEలో, జింక్ 4 నెలల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. రెండున్నర సంవత్సరాలలో ఇది కనిష్ట స్థాయికి దారితీసింది.
ఇవి కూడా చదవండి:
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..
Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 09 , 2025 | 03:55 PM