Share News

Stock Market Opening Bell: నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు, తర్వాత దూకుడు

ABN , Publish Date - Apr 01 , 2025 | 09:27 AM

అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి

Stock Market Opening Bell: నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు, తర్వాత దూకుడు
stock market

Stock Market Opening Bell: మూడు రోజుల విరామం అనంతరం ఈ ఉదయం భారత స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.‌ అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్‌ (Sensex) 450 పాయింట్లు.. నిఫ్టీ (Nifty) 100 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 190 పాయింట్లు, ఫిన్ నిఫ్టీ 170 పాయింట్లు, బ్యాంకెక్స్ 200 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి. అయితే, మొదట్లో నష్టాలతో ఓపెన్ అయినప్పటికీ భారత మార్కెట్ సూచీలు కొంచెం సేపటికే కోలుకొని లాభాల వైపు దూసుకెళ్లున్నాయి.


అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమ ఫలితాలనిచ్చాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 0.35 శాతం , డౌజోన్స్‌ 1.00 శాతం లాభంతో ముగియగా, యూఎస్ టెక్ 100 .0.34శాతం నష్టంతో క్లోజ్ అయింది. ఈ ఉదయం 9గంటల ప్రాంతంలో యూఎస్ 30 ఇండెక్స్ 0.23 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఇక యూరప్ మార్కెట్లన్నీ నిన్న నష్టాలతో ముగిశాయి. ఇక ఇవాళ ఆసియా మార్కెట్లు లాభాలతో నడుస్తున్నాయి. జపాన్‌ నిక్కీ 0.59 శాతం, హాంకాంగ్‌ హాంగెసెంగ్‌ 1.00 శాతం లాభంతో కదలాడుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.04 శాతం పెరిగి 85.45 వద్ద కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.26శాతం పెరిగి 74.16 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు

మోదీ ఉపాధి.. బాబు చేయూత: పురందేశ్వరి

వేతనజీవులకు పన్ను ఉపశమనం

For More AP News and Telugu News

Updated Date - Apr 01 , 2025 | 09:59 AM