Share News

Trade Setup For April 8: ఏప్రిల్ 8కి ట్రేడ్ సెటప్: మంగళవారం మార్కెట్ పరిస్థితి ఏంటి?

ABN , Publish Date - Apr 07 , 2025 | 10:13 PM

ప్రపంచ మార్కెట్లు పాతాళానికి చేరడంతో ఆ ప్రభావం భారత్ పైనా పడి భారత మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే, ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే.. ఇంతటి క్రైసిస్ లోనూ భారతదేశం ఆసియాలో రెండవ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన మార్కెట్‌గా అవతరించడం విశేషం.

Trade Setup For April 8:  ఏప్రిల్ 8కి ట్రేడ్ సెటప్: మంగళవారం మార్కెట్ పరిస్థితి ఏంటి?
stock market

సోమవారం(ఏప్రిల్ 7) స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం తర్వాత రేపటి మార్కెట్ సూచీల విశ్లేషణను ఒక సారి పరిశీలిద్దాం. నిఫ్టీ ఇండెక్స్‌కి 21,750 వద్ద తక్షణ మద్దతును(ఇమ్మీడియట్ సపోర్ట్) ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సోమవారం మార్కెట్ విపరీతంగా పడిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్‌ వేగవంతమైన రికవరీని పొందే అవకాశం కూడా ఉందంటున్నారు. ఒక వేళ ట్రంప్ టారిఫ్స్ విషయంలో ఏవైనా పాజిటివ్ సంకేతాలు వస్తున్న తరుణంలో భారత స్టాక్ మార్కెట్ బుల్లిష్ మూవ్ అత్యంత వేగంగా చూసేందుకు అవకాశం ఉందంటున్నారు.

ఇక, టెక్నికల్ గా చూస్తే సోమవారం డైలీ చార్ట్‌లో నిఫ్టీ గ్రీన్ క్యాండిల్‌ను ఏర్పాటు చేసిందని, ఇది పెట్టుబడిదారులు తక్కువ ధరలో వేగంగా కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనడానికి సంకేతంగా నిఫుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లో విపరీతమైన ఓలటాలిటీ ఉన్నప్పటికీ నిఫ్టీ మునుపటి మద్దతు 21,960 కంటే ఎక్కువగానే నిఫ్టీ క్లోజ్ అవడం దీనికి బలం చేకూరుస్తుందని చెబుతున్నారు. ఇక 22,800 దగ్గర ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఎదురు కావచ్చని భావిస్తున్నారు. ఓవర్‌సోల్డ్ మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, పుల్‌బ్యాక్ ర్యాలీని తోసిపుచ్చలేమని అంటున్నారు. అయితే, 22,800 మార్కు దాటితే బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ కావచ్చని అంటున్నారు.

ఇక, బ్యాంక్ నిఫ్టీ 50,650–50,750 జోన్ వద్ద అప్‌సైడ్ రెసిస్టెన్స్ ఎదురు కావచ్చని అంటున్నారు. టెక్నికల్ గా ఇండెక్స్ 49,500 వద్ద 50 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ ను కలిగి ఉందని అంటున్నారు. ఇక, అప్‌సైడ్‌లో, 50,650–50,750 జోన్ కీలక రెసిస్టెన్స్ ఏరియాగా పనిచేస్తుందని.. ఇండెక్స్‌లో కొత్త ర్యాలీని ప్రారంభించడానికి 50,750 కంటే ఎక్కువ.. అదీ స్థిరమైన కదలిక అవసరమని అంటున్నారు.

మార్కెట్ రీక్యాప్ :

బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు 10 నెలల కనిష్ట స్థాయికి చేరుకుని సోమవారం నష్టాలతో ముగిశాయి. ఇది వరుసగా మూడవ సెషన్‌ తగ్గుదల. వాల్ స్ట్రీట్ క్షీణత తర్వాత సోమవారం ఆసియా మార్కెట్లు 14 సంవత్సరాలలో అత్యధికంగా పడిపోయిన సందర్భం ఎదురైంది.

NSE నిఫ్టీ 50 742.85 పాయింట్లు లేదా 3.24% తగ్గి 22,161.60 వద్ద ముగిసింది, BSE సెన్సెక్స్ 2,226.79 పాయింట్లు లేదా 2.95% తగ్గి 73,137.90 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో, నిఫ్టీ 5.07% తగ్గి 21,743.65 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ 3,939.68 పాయింట్లు తగ్గి 71,425.01 వద్దకు చేరుకుంది. ఈ క్షీణత ఉన్నప్పటికీ, భారతదేశం ఆసియాలో రెండవ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన మార్కెట్‌గా అవతరించడం విశేషం.


ఇవి కూడా చదవండి:

మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్

తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

Read Latest and Viral News

Updated Date - Apr 07 , 2025 | 10:13 PM