Share News

Stock Markets Closing : నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:42 PM

Stock Market Opening : బుధవారం (ఇవాళ) స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. మదుపర్లు ఆద్యంతం రోజంతా అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమై, నష్టాలతోనే ముగిశాయి

Stock Markets Closing : నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు
stock market

Stock Market Wednesday Closing: దేశీయంగా పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఇవాళ భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమై, నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన టారిఫ్‌లతో చైనా ధీటుగా జవాబిస్తుండటంతో అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఇవాళ రేట్ కట్ ప్రకటించినా దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్స్ మీద బ్యాంక్ నిఫ్టీ సూచీ మీదా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. చైనాకు ప్రతిఘటనగా అమెరికా మళ్లీ కొత్తగా విధించిన 104 శాతం సుంకాలతో ఆసియా, యూరప్, ఆమెరికా మార్కెట్లు అన్నీనష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ఈ ప్రతికూల సంకేతాల నడుమ ఈ ఉదయం మొదలైన మన దేశీయ సూచీలు బుధవారం ట్రేడింగ్‌ను నష్టాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు రోజంతా కూడా చాలా అప్రమత్తతతో వ్యవహరించారు. దీంతో మార్కెట్ ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది.

ఇక, ఇవాళ మార్కెట్లు ముగిసే నమయానికి సెన్సెక్స్‌ 379.93 పాయింట్లు నష్టంతో 73,847.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 136.70 పాయింట్లు కుంగి 22,399.15 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 270.85 పాయింట్లు పతనమై 50,240.15 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.45 వద్ద ఉంది. మరోవైపు, బీజింగ్‌ నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా ఏకంగా 104శాతం టారిఫ్‌లు (Trump Tariffs) ప్రకటించిన నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్‌ 9 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి.


ఇవి కూడా చదవండి

Trump China Tariffs: చైనాపై ట్రంప్‌ బాదుడు 104 శాతానికి!

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 05:39 PM