Share News

ఆరోగ్య బీమాకు రైడర్ల బూస్ట్‌

ABN , Publish Date - Apr 13 , 2025 | 02:29 AM

ఈ రోజుల్లో కార్పొరేట్‌ వైద్యం చాలా ఖరీదుతో కూడిన వ్యవహారం. అందుకే ఆరోగ్య బీమా ఎంతో అవసరం. లేదంటే ఆస్తులు అర్పించుకోవాల్సిందే. ఒక్కోసారి బీమా కవరేజీ ఉన్నప్పటికీ, అదనంగా మన జేబు నుంచి ఖర్చు పెట్టాల్సి రావచ్చు...

ఆరోగ్య బీమాకు రైడర్ల బూస్ట్‌

ఈ రోజుల్లో కార్పొరేట్‌ వైద్యం చాలా ఖరీదుతో కూడిన వ్యవహారం. అందుకే ఆరోగ్య బీమా ఎంతో అవసరం. లేదంటే ఆస్తులు అర్పించుకోవాల్సిందే. ఒక్కోసారి బీమా కవరేజీ ఉన్నప్పటికీ, అదనంగా మన జేబు నుంచి ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఎందుకంటే, ఎంత సమగ్ర పాలసీ అయినా కొన్ని సందర్భాల్లో పాలసీదారు ప్రత్యేక అవసరానికి కవరేజీ కల్పించడంలో విఫలం కావచ్చు. అలాంటప్పుడే బీమా రైడర్లు పనికొస్తాయి. పాలసీ కవరేజీ లేమి లేదా అంతరాన్ని భర్తీ చేయడంతో పాటు పాలసీదారు ప్రత్యేక అవసరాలను తీర్చడం ద్వారా సంపూర్ణ రక్షణ కల్పిస్తాయి.

సమగ్ర కవరేజీ ఆవశ్యకత: వైద్య ఖర్చులు వేగంగా పెరుగుతున్న తరుణంలో వ్యక్తులు, కుటుంబాలు తమ ఆరోగ్యంతోపాటు ఆదాయాన్ని రక్షించుకోడం తప్పనిసరి. ఎందుకంటే, జీవనశైలి సమస్యలు పెరుగుతున్నాయి. ఇందుకు తోడు కొత్త వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆరోగ్య బీమా కవరేజీ కలిగి ఉండ టం కేవలం భవిష్యత్‌కు భద్రత మాత్రమే కాదు. మన భవిష్యత్‌ ఆర్థిక ప్రణాళికలోనూ అత్యవసర భాగం. అయితే, ఒకే ఆరోగ్య బీమా పాలసీ అందరి అవసరాలను తీర్చలేదు. బీమా రైడర్ల ద్వారా సమగ్ర కవరేజీ పొందవచ్చు.


రైడర్లు అంటే..: బీమా పాలసీ కవరేజీ పరిధిని మరింత విస్తరించేందుకు అదనపు ఫీచర్లు లేదా ఆఫర్ల జోడింపే రైడర్‌. ఇది మీ పాలసీ కవరేజీని మరింత బలోపేతం చేయడంతోపాటు ఊహించని ఆరోగ్య అత్యయిక సందర్భాల్లోనూ మిమ్మల్ని సంసిద్ధులుగా ఉంచుతుంది. మీ ఆర్థిక భవిష్యత్‌ అనిశ్చితిలోకి జారుకోకుండా కాపాడుతుంది. క్యాన్సర్‌ వంటి పెద్ద జబ్బులు, తీవ్ర అనారోగ్యాల వైద్యానికి కవరేజీ కల్పించే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌, యాక్సిడెంటల్‌ డెత్‌ రైడర్‌, ప్రసవ ఖర్చులకూ కవరేజీ కల్పించే రైడర్‌ ఇందుకు కొన్ని ఉదాహరణలు. వీటి ద్వారా మీ పాలసీ కవరేజీలోని అంతరాలను భర్తీ చేయవచ్చు.


ప్రయోజనాలు

అదనపు కవరేజీ: బీమా రైడర్లు మీ పాలసీ కవరేజీ పరిధిని విస్తరిస్తాయి. ఉదాహరణకు, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ ఏదైనా పెద్ద జబ్బు చేసినప్పుడు వైద్యానికయ్యే భారీ ఖర్చుకు కవరేజీ కల్పిస్తుంది.

అవసరానికి అనుగుణంగా మార్పులు: ఆరోగ్య అవసరాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. బీమా రైడర్లు మీ వ్యక్తిగత, ప్రత్యేక అవసరాలను తీరుస్తాయి. అలాగే, మీ కవరేజీ అవసరానికి మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

వెసులుబాటు: మీ జీవిత దశలు, ఆర్యోగ ప్రాధాన్యాల ఆధారంగా ఆరోగ్య బీమా పాలసీ కవరేజీ కావాల్సినప్పుడు మార్చుకునే వెసులుబాటును రైడర్లు కల్పిస్తాయి.

తక్కువ ఖర్చు: ఒక్కో అవసరం కోసం ప్రత్యేక పాలసీ కొనుగోలు చేయడం కంటే రైడర్ల ఎంపిక ద్వారా అదనపు కవరేజీ పొందడం తక్కువ ఖర్చుతో కూడిన ప్రక్రియ.

ఆర్థిక భద్రత: ఊహించని వైద్య అవసరాలకూ కవరేజీ కల్పించడం ద్వారా రైడర్లు మీ ఆరోగ్యంతో పాటు ఆదాయం, ఆస్తులకూ అదనపు రక్షణ కల్పిస్తాయి.


పరిమితులు

వెయిటింగ్‌ పీరియడ్‌: చాలా వరకు బీమా రైడర్లు వెయిటింగ్‌ పీరియడ్‌తో కూడినవే. అంటే, పాలసీదారు రైడర్‌ కొనుగోలు చేసినప్పటికీ, వెయిటింగ్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాతే దాని ప్రయోజనాలను పొందడానికి వీలుంటుంది.

పరిమిత పరిధి: రైడర్లు ప్రత్యేక వైద్య అవసరం లేదా సందర్భం నుంచి రక్షిస్తుంది. అంతేతప్ప అన్ని ఆపద సందర్భాల్లోనూ ఒకే రైడర్‌ కవరేజీ కల్పించదు.

మినహాయింపులు: రైడర్ల ద్వారానూ కొన్ని పరిస్థితులు లేదా సందర్భాల్లో కవరేజీ లభించకపోవచ్చు. అందుకే పాలసీ నియమ నిబంధనలను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

రమిత్‌ గోయల్‌, సీడీవో

ఫ్యూచర్‌ జెనరాలీ ఇండియా

ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: లేడి ఎస్సైతో అలాంటి పనా.. నీకుందిలే అంటూ నెటిజన్లు ఫైర్..

Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..

Inter Student Passed Away: షాకింగ్ న్యూస్.. పరీక్షల్లో తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

Updated Date - Apr 13 , 2025 | 02:29 AM