ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: టైరు పంక్చరవడంతో అదుపుతప్పి బస్సు బోల్తా..

ABN, Publish Date - Feb 25 , 2025 | 07:27 AM

చుట్టూ చీకటి. నిద్రమత్తులో ప్రయాణికులు. ఒక్క కుదుపుతో బోల్తాపడిన బస్సు. ఏమైందో.. ఏం జరిగిందో తెలియక ఒకటే అరుపులు. ఇదీ సూళ్లూరుపేట(Sullurupeta)లోని మన్నారుపోలూరు క్రాస్‌ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటాక పరిస్థితి.

- 17 మందికి గాయాలు.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం

సూళ్లూరుపేట(చిత్తూరు): చుట్టూ చీకటి. నిద్రమత్తులో ప్రయాణికులు. ఒక్క కుదుపుతో బోల్తాపడిన బస్సు. ఏమైందో.. ఏం జరిగిందో తెలియక ఒకటే అరుపులు. ఇదీ సూళ్లూరుపేట(Sullurupeta)లోని మన్నారుపోలూరు క్రాస్‌ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటాక పరిస్థితి. పాండిచ్చేరి నుంచి విజయవాడ(Vijayawada)కు ప్రయాణికులతో వస్తున్న మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్‌ బస్సు ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు క్రాస్‌రోడ్డు సమీపానికి వచ్చింది.

ఈ వార్తను కూడా చదవండి: ఏడు పదుల వయసులో నీటిపై తేలుతూ యోగా..


ఆ సమయంలో టైరు పంక్చరు అయింది. వేగంగా వస్తున్న బస్సును డ్రైవరు అదుపు చేయలేకపోయారు. దీంతో హైవే రెయిలింగ్‌ను ఢీకొని దాదాపు 10 అడుగుల లోతులో బస్సు బోల్తాపడింది. ఎస్‌ఐ బ్రహ్మనాయుడు తన సిబ్బందితో అక్కడకు చేరుకొన్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకు తీసి.. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


ప్రమాదం జరిగిన సమయంలో 34 మంది ప్రయాణికులు ఉండగా, 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో బస్సు రెండో డ్రైవర్‌ సాయి సిద్దేష్‌, ప్రయాణికుడు ఎ.చందుకు తీవ్ర గాయాలై, పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకి తరలించారు. బస్సు ముందుభాగం నుంచి సగం వరకు నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి కారణం అతివేగమేని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 07:27 AM