Hyderabad: డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌.. రూ.5లక్షల విలువగల కొకైన్‌ స్వాధీనం

ABN, Publish Date - Feb 07 , 2025 | 08:39 AM

డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంఘటన మాదాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhapur Police Station) పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇజ్జత్‌నగర్‌ అలేఖ్య హోమ్స్‌(Izzatnagar Alekhya Homes)లో నివాసముంటున్న చంద్రపు ప్రసన్నకుమార్‌ రెడ్డి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

Hyderabad: డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌.. రూ.5లక్షల విలువగల కొకైన్‌ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంఘటన మాదాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhapur Police Station) పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇజ్జత్‌నగర్‌ అలేఖ్య హోమ్స్‌(Izzatnagar Alekhya Homes)లో నివాసముంటున్న చంద్రపు ప్రసన్నకుమార్‌ రెడ్డి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులోని హెబ్బలకు చెందిన కెవిన్‌ అనే డ్రగ్స్‌ వ్యాపారి గురువారం ప్రసన్నకుమార్‌రెడ్డికి డ్రగ్స్‌ను విక్రయించేందుకు హైటెక్స్‌ మెటల్‌ చార్మినార్‌ వద్దకు వచ్చాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య


విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్‌ ఎస్‌ఓటీ, సివిల్స్‌ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి డ్రగ్స్‌ వ్యాపారి కెవిన్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి వద్ద రూ.5లక్షల విలువైన 23 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకోగా.. మరో ఇద్దరు నిందితులు పాల్వంచకు చెందిన జూపల్లి విశ్వామిత్ర, మణికొండకు చెందిన శ్రీనివాససాయి దీపక్‌, సికింద్రాబాద్‌ చెందిన వరుణ్‌ గౌడ్‌(Varun Goud)లు పరారీలో ఉన్నారు.


అదేవిధంగా మాదాపూర్‌ చందానాయక్‌ తండాలోని పీజీ హాస్టల్‌లో నివాసముంటున్న గుక్తా తేజ కృష్ణ ఆర్కిటెక్ట్‌గా చేస్తున్నాడు. బెంగళూరు(Bangalore)కు చెందిన సంధ్యా అనే యువతి వద్ద మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వద్ద డ్రగ్స్‌ కొనుగోలు చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు గుత్తా తేజ కృష్ణని అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సంధ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు

ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్‌ ఎన్నికలకే మొగ్గు

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర

ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2025 | 08:39 AM