Hyderabad: తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడి అరెస్ట్‌

ABN, Publish Date - Mar 22 , 2025 | 08:55 AM

తప్పు చేసినవాడు ఎప్పటికైనా దొరకకపోడు అనే నానుడి అక్షరాలా నిజమైంది. పలువురిని మోసం చేసి దర్జాగా తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. స్టార్టప్‌ కంపెనీలో పార్టనర్‌షిప్‌ ఇస్తానని పలువురిని నమ్మించి లక్షల్లో వసూల్‌ చేసి తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడిని పోలీసులు అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి నెట్టారు.

Hyderabad: తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: స్టార్టప్‌ కంపెనీ(Startup company)లో పార్టనర్‌షిప్‌ ఇస్తానని పలువురిని నమ్మించి లక్షల్లో వసూల్‌ చేసి తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడిని పోలీసులు అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి నెట్టారు. టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాస్‌(Task Force Additional DCP Ande Srinivas) తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన గురు శ్రీరంగ శ్రీనివాస్‌ బండనబోయిన డిగ్రీ వరకు చదవి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. నగరానికి వచ్చి బేగంపేటలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అమ్మో.. రూ.24.84 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..


కొద్దీ రోజుల్లోనే అతడి తండ్రి మృతిచెందడంతో తిరిగి ప్రకాశం జిల్లాకు వెళ్లి అక్కడ రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. పెద్దగా సక్సెక్‌ కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో శ్రీరంగ శ్రీనివాస్‌ తన మకాంను 2022లో హైదరాబాద్‌కు మార్చాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో డబ్బుకోసం మరో పథకం వేశాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండటంతో సాఫ్ట్‌వేర్‌ స్టార్టప్‌ కంపెనీ పెడుతున్నానంటూ పలువురిని నమ్మించాడు. తనకు సన్నీ అనే స్నేహితుని ద్వారా పరిచయం అయిన వ్యక్తి వద్ద రూ. 3లక్షలు 18 శాతం వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు.


అందుకు లంగర్‌హౌజ్‌ బాపూనగర్‌(Langar House Bapunagar)లో ఉన్న ఇంటిని పత్రాలను షూరిటీగా పెడుతున్నట్లు నమ్మించి నకిలీ పత్రాలపై సేల్‌డీడ్‌ చేశాడు. తాను పెట్టే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పార్టనర్‌షిప్‌ ఇస్తానని నమ్మించాడు. ఆ తర్వాత అసలు ఆస్తి పత్రాలను తీసుకెళ్లి మరో రెండు ఫైనాన్స్‌ బ్యాంకుల్లో తనఖా పెట్టి ఒకచోట రూ.49.50లక్షలు, మరోచోట రూ.20లక్షలు అప్పు తీసుకున్నాడు.


అనంతరం డబ్బులు ఇవ్వకుండా రెండేళ్ల నుంచి తప్పించుకు తిరుగతు న్నాడు. నారాయణగూడ, లంగర్‌హౌజ్‌ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన సౌత్‌వెస్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం గుంటూరు జిల్లా పద్మజా కాలనీలో శ్రీరంగ శ్రీనివాస్ ను అరెస్ట్‌ చేసి నగరానికి తీసుకొచ్చి లంగర్‌హౌజ్‌ పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి ఇన్నోవా కారు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విద్యుత్‌ చార్జీలు పెంచడం లేదు

మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 22 , 2025 | 08:55 AM