ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మద్యం మత్తులో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి..

ABN, Publish Date - Jan 16 , 2025 | 08:08 AM

బైక్‌తో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ సంధ్య(SI Sandhya) తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురానికి చెందిన ఫ్రాంక్లిన్‌ ఫెలిక్స్‌(27) బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిష్‏(BHEL Township)లో నివసిస్తూ జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు

చందానగర్‌(హైదరాబాద్): బైక్‌తో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ సంధ్య(SI Sandhya) తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురానికి చెందిన ఫ్రాంక్లిన్‌ ఫెలిక్స్‌(27) బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిష్‏(BHEL Township)లో నివసిస్తూ జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. బీహెచ్‌ఈఎల్‌(BHEL)కు చెందిన మైలారం స్వర్ణలతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కోకాపేటలో నివసిస్తున్న స్నేహితులు వంశీ, ప్రకాష్‌(Vamshi, Prakash) వద్దకు వెళ్లాడు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు


అందరూ కలిసి మద్యం తాగారు. బుధవారం తెల్లవారు జామున బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నల్లగండ్ల అపర్ణ సరోవర్‌ వద్ద విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన ఫ్రాంక్లిన్‌ ఫెలిక్స్‌ను సమీపంలోగల సిటిజన్‌ ఆస్పత్రి(Citizen Hospital)కి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మృతుడి భార్య ఆస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరైంది. చందానగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?

ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్‌ కుంభకోణంపై నీలినీడలు !

Read Latest Telangana News and National News

Updated Date - Jan 16 , 2025 | 08:08 AM